వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు హీరోల మధ్య వైరం

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi-Balakrishna
ఐ హేట్ బాలయ్య వెబ్‌సైట్ వివాదంతో తెలుగు హీరోల మధ్య వైరం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తెలుగు హీరోల్లో ఒకరంటే ఒకరికి పడదు. ఇదే వైరస్ వారి అభిమానులకు కూడా సోకింది. హీరోల అభిమానులు పరస్పరం ఘర్షణకు దిగిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇటీవలే హీరో రాజశేఖర్‌పై చిరంజీవి అభిమానులు దాడి జరిపిన ఉదంతం అందరికీ తెలిసిందే. అభిమానం దురభిమానంగా మారి, ఇతరుల పట్ల అసహనానికి దారి తీస్తోంది. ఆ అసహనం రకరకాల వెర్రితలలు వేస్తుంది. ఆ వెర్రితలలు వేసిన అవాంఛనీయ ఉదంతానికి ఐ హేట్ బాలయ్య వెబ్‌సైట్ వ్యవహారాన్ని పరాకాష్టగా చెప్పవచ్చు. మెగా స్టార్ చిరంజీవి, బాలకృష్ణ అభిమానులకు క్షణం పడదు. చిరంజీవి అభిమానులకు రాజశేఖర్‌పై కుత్తుకల దాకా కోపం ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటుంది.

హీరోల వ్యవహారమే అభిమానుల తీరుకు కారణమని చెప్పవచ్చు. తెలుగులో వృత్తిపరమైన పోటీ తక్కువ. ఇతరేతర విషయాలే ప్రాధాన్యాన్ని సంతరించుకుంటాయి. తమిళంలో రజనీకాంత్, కమలహాసన్‌ల మధ్య పోటీ ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా వారిద్దరు మంచి మిత్రులు. ఆలాంటి వాతావరణం తెలుగులో లేదు. చెప్పాలంటే తెలుగు సినీ పరిశ్రమ రెండు సామాజిక వర్గాల మధ్య పోరుగా పరిణమించింది. ఆ రెండు సామాజిక వర్గాలు పరస్పరం ఆధిపత్యం కోసం పోటీ పడుతుంటాయనేది అందరికీ తెలిసిన విషయమే. మధ్య మధ్యలో పాత్రలు అటూ ఇటూ మారుతుంటాయి. అందులోనూ వ్యక్తిగతమైన కారణాలే ఎక్కువగా పనిచేస్తాయి.

ఇటు నందమూరి కుటుంబ హీరోలు, అటు చిరంజీవి కుటుంబ హీరోలు తెలుగు సినీ ప్రపంచాన్ని ఏలుతున్నారు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వారు సూపర్ స్టార్లుగా చెలామణి అవుతుంటారు. ఒకప్పుడు చిరంజీవికి, మోహన్ బాబుకు మధ్య పడేది కాదు. వారిద్దరు బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. చిరంజీవికి, బాలకృష్ణకు మధ్య వైరంగా కూడా తెలుగు సినీ రంగాన్ని చూస్తారు. అదే ఇరువురి అభిమానుల మధ్య వైరానికి కారణమవుతోంది. వ్యక్తిగత ప్రయోజనాలు, ఆధిపత్య పోరు ఎక్కువ కావడంతో అభిమానులు దానికి బలిపశువులుగా మారుతున్నారు. చిరంజీవిపై రాజశేఖర్ తీవ్రమైన ఆరోపణలు చేయడం, ఆ ఆరోపణలకు చిరంజీవి అభిమానులు చెలరేగడం ఇందుకు మంచి ఉదాహరణగా చెప్పవచ్చు.

మంచి కథ వల్ల మంచి సినిమా వస్తుందని, ప్రేక్షకాదరణ పొందుతుందని మన అగ్రహీరోలకు నమ్మకం లేదు. తాను ఎంత ఎక్కువగా కనిపిస్తాను, తన హీరోయిజం ఎలా పండుతుందనే దానిపైనే ఎక్కువగా దృష్టి పెడతారు. పాత్ర కోసమైనా సరే, కాస్తా నెమ్మదించే పాత్రను వారు అంగీకరించరు. ఆరు యుగళగీతాలు, పది ఫైట్లుగా సినిమా సాగిపోవాల్సిందే. విలన్లను, వారి అనుచరులను ఒంటి చేతి మీద నరికిపడేయాల్సిందే. తమ పాత్ర అంత హీరోచితంగా ఉంటేనే అభిమానులకు తమపై అభిమానం ఉంటుందని, అభిమానులే సినిమాను విజయవంతం చేస్తారని వారు నమ్ముతారు. సినిమా బాక్సాఫీసు వద్ద చతికిలపడితే దర్శకుడి మీదనో, మరొకరి మీదనో విరుచుకుపడుతారు. ఈ అవసవ్య విధానమే బాహ్య ప్రపంచంలోనూ వ్యక్తమవుతోంది.

English summary
Tollywood is filled with unhealthy competition..Heroes of two families are trying to dominate each other. They never think about artistic values in their films. They want to be focused their heroism in the films. This trend extended to their fans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X