తెలుగు హీరోలు ఉత్తమ పురుషులేనా?

ఉత్తమ పురుషుడు ఎలా ఉండాలి? అనే విషయాన్ని రామాయణం చెబితే, ఎలా ఉండకూడదో ఇప్పటి సినిమాలు చూపిస్తున్నాయి. అగ్రహీరోలు, దర్శకులే సమాజంపైకి ఇలాంటి సినిమాలు వదులుతున్నారు. ఈ సినిమాలకే కొందరు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టివిజయాన్ని విజయవంతం చేయడం గమనార్హం. మరి ఇందులో తప్పు ఎవరిది? ఎవరిని నిదించాలి?
ఒకప్పుడు హీరో మంచి బాలుడు అనే కోణంలో కథలు పుట్టేవి. మంచివాడైన హీరో చెడుపై ఎలా పోరాటం చేసి విజయం సాధించాడో చూపించే వారు. కథలు, సన్నివేశాలు అతనిలో నీతి నిజాయితీకి అద్దం పట్టేవి. మంచి మనసులు, తేనె మనసులు, బుద్దిమంతుడు...ఈ విధంగా సినిమా పేర్లు ఉండేవి.
కానీ ప్రస్తుతం సినిమా ట్రెండే మారి పోయింది. అసలు సినిమా ముఖ్య కథానాయకుడు చేస్తున్న పాత్రలు మంచితో కూడుకున్నవా? లేక చెడుతో కూడుకున్నవా? అనే విషయం అర్థం కావడం లేదు. ఆర్య-2 సినిమా విషయానికొస్తే అల్లు అర్జున్ విలనా? హీరోనా? అనే విషయం అర్థమేకాదు. జగడం సినిమాలో హీరోకు లక్ష్యం అనేదే ఉండదు. బుజ్జిగాడు సినిమాలో హీరో డబ్బు కోసం హత్యలు చేసే రకం. తీన్ మార్, ఆరెంజ్ లలో ప్రియురాళ్లను మార్చే హీరోలు. ఈ విధంగా వీరు సమాజంపైకి చెడును చిమ్ముతున్నారా? లేక కాస్తో కూస్తో మిగిలి ఉన్నమంచిని మాయం చేస్తున్నారా? అనే విషయం సినిమాలు చూస్తున్న ప్రేక్షకులే నిర్ణయించుకోవాలి.












Click it and Unblock the Notifications