తెలుగు సినిమాల్లో లిప్ లాక్స్

Anushka
మన కథానాయికలు ఇప్పుడు దేనికైనా సిద్ధమంటున్నారు. గతంలో లిప్ టు లిప్ కిస్ అంటే నో అనేవారు. ఇప్పుడు లిప్ టు లిప్ అంటే ఏమాత్రం ఆందోళన చెందకుండా వెంటనే సరే అనేస్తున్నారు. గతంలో ఇలాంటి ముద్దు సీన్లకు నో అని చెప్పేవారు మన ముద్దుగుమ్మలు. కానీ గత కొన్ని చిత్రాలను పరిశీలిస్తే మన కథానాయికలు కూడా దేనికైనా సిద్ధమన్నట్టుగా కనిపిస్తున్నారు. లిప్ టు లిప్ కిస్ సాంప్రదాయం హాలివుడ్ సినిమాలలో ఉంటుంది. ఇది క్రమంగా బాలీవుడ్‌కు పాకింది. అక్కడ నుండి క్రమంగా ఆ జాడ్యం తెలుగు సినిమాకు కూడా పాకింది. టాప్ హీరోయిన్లు అయిన అనుష్క, ప్రియమణి, ఇలియానా, త్రిష, కాజల్ మాత్రమే కాదు నిన్న మొన్న వచ్చిన సమంత, ప్రియా ఆనంద్‌లు కూడా హీరోలకు పెదవులు జుర్రుకోమని అందిస్తున్నారు.

ఇమ్రాన్ హష్మీ పుణ్యమా అని ముద్దులలోని మత్తు మరింత సినీ ప్రియులకు తెలిసి వచ్చింది. తెలుగులో వల్లభగా వచ్చిన వల్లభన్ చిత్రంలో హీరో శింబు కథానాయిక నయనతార పెదవిని పంటితో అందుకునే సీన్‌తో చిత్రానికి భారీ అడ్వర్జయిజ్ అయింది. ఆ సన్నివేశం శింబు, నయనల హాట్ కిస్‌ను ప్రేక్షకుల మదిలో ఎప్పుడు ఉంటుందంట. అయితే మన టాలీవుడ్ కూడా తక్కువేమీ తినలేదు. గతంలో నాని చిత్రంలో మహేష్ బాబు - అమీషా పటేల్‌ల ముద్దులు చర్చానీయాంశం అయ్యాయి. ఆ తర్వాత చందమామ చిత్రంలో ముద్దుపై ముద్దు పెట్టు పాటలో సింధుమీనన్‌పై హీరో ముద్దుల వర్షం కురిపించి ఎక్కడెక్కడ ముద్దులు ఎలా పెట్టాలని పాట మొత్తంలో వివరించాడు. ఆ పాట యువతరానికి కిక్కెక్కించింది. మన్మథుడు తనయుడు నాగచైతన్నయ ఏమాయ చేశావే చిత్రంలో మల్లెపూవు వంటి సమంత పెదవిని అందుకున్నాడు. రాజ్ చిత్రంలో సుమంత్ సెక్సీ గరళ్స్ ప్రియమణి, విమలారామన్‌పై ముద్దుల వర్షం కురిపించి ప్రేక్షకులను రంజింప చేశారు.

ముద్దు సన్నివేశాలకు దూరంగా ఉండే పవన్ కల్యాణ్ కూడా తన తాజా చిత్రం తీన్‌మార్‌లో త్రిషకు ఘాటు ముగ్దు ఇచ్చాడు. త్వరలో విడుదల కాబోయే నేను నా రాక్షసి, 180 చిత్రాలలో కూడా ఇలియానా, ప్రియా ఆనంద్‌లు యువతకు పిచ్చెక్కిచ్చేలా హీరోలకు కిస్‌లు ఇచ్చారంట. అయితే ఇంత ఘాటుగా కిస్‌లు ఇస్తున్న ముద్దుగుమ్మలు అదేంటి అని అడిగితే వారి నోటి నుండి వచ్చే జవాబు ఒకటే సన్నివేశం డిమాండ్ చేసింది, కథలో అదే అసలు పాయింట్ అని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+