హీరోల అదృష్టమా? హీరోయిన్ల దురదృష్టమా?

కథనాయకులతో పోలిస్తే నాయికల నట జీవితం కాలం చాలా తక్కువ. సౌందర్య తరువాత ఎక్కువకాలం హీరోయిన్ గా రాణించిన వాళ్లు లేరు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమైనవాళ్లు నాలుగైదేళ్లకు మించి నెగ్గుకు రాలేక పోతున్నారు. అటు గ్లామర్, ఇటు అభినయం రెండింటినీ చూసుకుంటున్న వాళ్లు ఇంకొన్నాళ్లు నిలబడుతున్నారు. వయసు విషయంలో బాలీవుడ్ భామలే నయం. అక్కడ వయసు సమస్య అంతగా కనిపించదు. ఐశ్వర్య, కరీనా కపూర్, బిపాస బసుర, రాణి ముఖర్జీ వీళ్లంతా వయసు మీరిన భామలే. అయితే అవకాశాలు దక్కించు కోవడంలో మాత్రం యువతరంతో పోటీ పడుతున్నారు.
మన వద్ద ఇలా జరుగడానికి కారణం తెలుగులో వయస్తున్న కథలే. కథ ఎప్పుడూ హీరో చుట్టే తిరుగుతుంది. నాయిక కేవలం అందాల బొమ్మగానే మిగిలి పోతోంది. హీరో వయసు ఎంత ఉన్నా..ఆయన పక్కన జోడీ కట్టే భామ మాత్రం మంచి యవ్వనంతో పిటపిటలాడుతూ ఉండాలి. సమాజం పోకడే అంత. హాలీవుడ్ లో వయసుతో సంబంధం లేకుండా హీరోయిన్లు 50 ఏళ్ల తర్వాత కూడా ఎలాంటి ఢోకా ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే మన తెలుగులో నెలకొన్న పరిస్థితులు హీరోల పాలిట అదృష్టంగాను, హీరోయిన్ల పాలిట దురదృష్టంగాను చెప్పుకోక తప్పదు.












Click it and Unblock the Notifications