తాగటం మానేసినా ఇబ్బందే...

Impacts of Quit Smoking on Lungs..
మెల్ బోర్న్: పాడు అలవాటు..! గుండెకు చిల్లులు పెట్టింది..! మానేసి ప్రశాతంగా బుతుకుతున్నా..!నని అనుకునే వారు అంత సంబరం పడాల్సిన అవసరం లేదని ఆస్ట్రేలియా పరిశోధకలు చెబుతున్నారు. పొగ తాగటం మానేసిన తరువాత కూడా, చాలా కాలం పాటు దాని దుష్పలితం ఊపిరితిత్తులను వెంటాడుతూనే ఉంటుందట.

పోగతాగేవారిలో, ఊపిరితిత్తులు గాలిని స్వీకరించే విధానంలో శారీరక మర్పులు చోటుచేసుకుంటాయని సిడ్నీ విశ్వవిద్యాలయం పరిశోధకుల బృందం తేల్చింది. పొగతాగేవారిలో గాలిని లోపలికి పీల్చే మార్గం బాగా మందంగా తయారై, రానురాను గాలి పీల్చడమే కష్టమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఈ పరిశోధనలో కనుగొన్నారు.

పొగ తాగే, తాగని దాతల నుంచి సేకరించిన రెండు రకాల ఊపిరితిత్తుల పై పరిశోధకులు పరీక్షలు జరిపారు. ఈ అధ్యయనంలో గాలిని లోపలికి స్వీకరించే విధానంలోనే అవయువ నిర్మాణంలో తేడాలు ఏర్పడ్డట్టు వారు గమనించారు. కనుక పాగత్రాగటం వంటి వ్యసనాలకు దూరంగా ఉండటం ఉత్తమమని వీరు చెబుతున్నారు. ఒక వేళ ఈ వ్యసనానికి అలవాటు పడినా త్వరగా స్వస్తి చెప్పటం మంచిదని పరిశోధకులు పేర్కొంటున్నారు. పొగతాగడం అధికమవుతే.. ముందు ముందు అసలు గాలి పీల్చడమే కష్టం కావచ్చునని వీరు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+