వర్మ లగడపాటి మాట వింటారా!

Lagadapati Rajagopal
ఒకరు రాజకీయాల్లో సెన్షేషన్, మరొకరు సినిమాల్లో సెన్షేషన్. వారు ఏది మాట్లాడినా అదో హాట్ టాపిక్ అవుతుంది. వారే విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అయితే వీరద్దరి మధ్య కళాశాల స్థాయి నుండే మంచి స్నేహం ఉంది. గతంలో వర్మ తీసిన చాలా చిత్రాలు టైటిల్ పరంగానో, సినిమా పరంగానో, ఆయన మాట్లాడిన వ్యాఖ్యల పరంగానో వివాదాస్పదం అయ్యారు. అయితే తాజాగా బెజవాడ రౌడీలు అనే టైటిల్ చాలా వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే.

అయితే వర్మ ఏ పేరు అయితే పెట్టాడో ఆ పేరుగల నియోజకవర్గానికి ఆయన స్నేహితుడు లగడపాటి రాజగోపాల్ పార్లమెంటు సభ్యుడు. దీంతో పలువురు బెజవాడ టైటిల్‌ను మార్పించాలని లగడపాటి వద్ద మొరపెట్టుకున్నారు. అయితే ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో లగడపాటి మాట్లాడుతూ తాను వర్మతో మాట్లాడానని ఆయన బెజవాడ రౌడీలు చిత్రం టైటిల్‌ను మారుస్తానని చెప్పారని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు చిత్రం పేరును మార్చుతున్నట్లు వర్మ చెప్పక పోయినా లగడపాటి చెప్పినట్లు చిత్రం విడుదల సమయం వరకైనా పేరు మార్చుతారా అని బెజవాడ ప్రజలు ఎదురు చూస్తున్నారు.

వర్మ ఎప్పుడూ పబ్లిసిటీకి ప్రధాన్యత ఇస్తాడు. బెజవాడ టైటిల్ వివాదం కారణంగా ఇప్పటికే ఆయన అనుకున్నదానికంటే ఎక్కువ పబ్లిసిటీ వచ్చింది. తాను చేసేదంతా పబ్లిసిటీ కోసమే అని ఆయనే ముక్కుసూటిగా చెబుతారు. మరి తాను అనుకున్న పబ్లిసిటీ వచ్చింది కాబట్టి వర్మ టైటిల్ పేరు మార్చే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. అయితే మామూలుగా వర్మ మొండిఘటం. తాను చేయాలనుకున్నది చేసే రకం. అయితే తన స్నేహితుడి కోసమో, లేదా బెజవాడ ప్రజల డిమాండు కోసమే ఏమైనా వర్మ పేరు మార్చుతారా అనే అనుమానం వ్యక్తం చేసే వారు కూడా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+