తమిళ హీరోలతో పోటీ పడలేక...

కార్తి ఏకకాలంలో తమిళం, తెలుగులో తన మార్కెట్ పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
కార్తి నటించిన తమిళం చిత్రాలు తెలుగులో డబ్బింగ్ అవుతున్నాయి. వాటి ప్రమోషన్ కోసం తరచుగా హైదరాబాద్ వస్తూ, డబ్బింగ్ చిత్రాలకు స్ట్రయిట్ లుక్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. హీరోలకు రెండు భాషల్లో మార్కెట్ ఉంటే నిర్మాతలకు చిత్రాలు తీయడం చాలా సులువని గ్రహించే ఈ ప్లాన్ చేస్తున్నాడు. అందులోనూ తమ స్వంత బ్యానర్ పైనే ఈ అన్నదమ్ములు తమ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఇక మన హీరోలు నటించిన శక్తి,మగధీర అక్కడ అంతంత మాత్రంగానే ఆడాయి. అస్సలు తెలుగు సినిమా అంటే ఓపినింగ్స్ కూడా రావటం లేదని అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారు. దానకి కారణం మన హీరోలు అక్కడ సరిగ్గా మార్కెట్ చేయకపోవటం అంటున్నారు.












Click it and Unblock the Notifications