కండలు పెంచడం డయాబెటీస్ అవకాశాలను తగ్గిస్తుంది!

ఈ రీసెర్చి ఫిట్ నెస్ మెయింటైన్ చేయటానికి కృషి చేయాలని కండలను తయారు చేసుకోవాలని కూడా సూచిస్తోంది. కనుక ఇకపై బరువు తగ్గాలంటూ తమ ఆహారాన్ని నియంత్రించుకొనే వారంతా, తాము తీసుకునే ఆహారాన్ని ఫిట్ నెస్ మెయింటెనెన్స్ కు వినియోగించి కండలను కూడబెట్టి మెటబాలిజం ప్రక్రియను మార్చి వేస్తే, డయాబెటీస్ దూరమైనట్లే! కండలు అధికంగా వుంటే ఇన్సులిన్ ప్రభావం కూడా అధికంగా వుండి డయాబెటీస్ రోగాన్ని పూర్తిగా దూరం చేస్తుందని ఈ అధ్యయనం తెలుపుతోంది.
పొట్ట, నడుము చుట్టు కొలతలు తగ్గించుకొంటూ బాడీ మాస్ ఇండెక్స్ ను తగ్గిస్తే చాలదు, మజిల్ మాస్ ను కూడా పెంచుకొంటూ ఫిట్ నెస్ సంపాదించాలంటాడు రీసెర్చర్ శ్రీకాంతన్. తాజాగా ఈ రీసెర్చర్ చేసిన అధ్యయనం ఎండోక్రైన్ సొసైటి ప్రచురించే క్లినికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం అనే జర్నల్ లో రానుంది.












Click it and Unblock the Notifications