పరిటాలతో మొదలు, అంతం ఎక్కడ?

మొద్దు శీను జైల్లోనే హత్యకు గురయ్యాడు. మొద్దు శీనును తానే హత్య చేశానని ఓం ప్రకాష్ అనే వ్యక్తి అంగీకరించాడు. పరిటాల రవిని చంపిన తర్వాత బావ సూరి కళ్లలో ఆనందం చూశానని మొద్దు శీను చెప్పుకున్నాడు. అయితే, ఆ తర్వాత మొద్దు శీనుకు, మద్దెలచెర్వు సూరికి మధ్య విభేదాలు పొడసూపినట్లు ప్రచారం జరిగింది. ఈ స్థితిలో మొద్దు శీను హత్య జరిగింది. సూరే ఈ పని చేయించాడని కూడా ఆరోపణలు వచ్చాయి. పరిటాల రవి హత్య కేసులోనే కాకుండా మొద్దు శీను హత్యతోనూ తనకు ఎలాంటి సంబంధం లేదని సూరి చెబుతూ వచ్చాడు. అదే వరుసలో సాంబశివరావు అనే వైద్యుడు శవం దిక్కూ మొక్కూ లేకుండా నడికుడి వద్ద రైల్వే ట్రాక్‌పై పడి ఉంది. ఈ వైద్యుడి చర్లపల్లి జైల్లో సూరికి సెల్‌ఫోన్లు అందజేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో అతని పని అయిపోయినట్లు చెబుతారు. అండర్ వరల్డ్ డాన్‌తో సంబంధాలున్న అజీజ్ రెడ్డి అనే వ్యక్తి హైదరాబాదులో పోలీసు కాల్పుల్లో మరణించాడు.
చోటా షీకీల్‌తో సంబంధాలున్న అజీజ్ రెడ్డి మొత్తం వ్యవహారంలో ఆయుధాలు సరఫరా చేసినట్లు అప్పట్లో ఊహాగానాలు చెలరేగాయి. పరిటాల రవి హత్య వ్యవహారంలో ఏదో మేరకు అజీజ్ రెడ్డి పాత్ర కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఆ నేపథ్యంలోనే అజీజ్ రెడ్డి పోలీసు కాల్పుల్లో మరణించాడని చెబుతారు. తాజాగా, మద్దెలచెర్వు సూరి తన అనుచరుడు భాను కిరణ్ చేతిలోనే అంతమయ్యాడు. పరిటాల రవి హత్యోదంతంతో మొదలైన సీరియల్ కిల్లింగ్స్ సూరి దాకా నడిచింది. వరుసలో తర్వాత ఎవరుంటారనే విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న భాను కిరణ్ పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. భాను కిరణ్ ఏమయ్యాడనే ప్రశ్న మీడియానే కాదు, అందరినీ తొలుస్తోంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications