నాగార్జునకు పెద్ద సవాల్

అందులోనూ రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న నాగార్జున..బాబాలోని నిరాడంబరత్వాన్నీ, ప్రేమ తత్త్వాన్నీ, శాంతి తత్త్వాన్నీ ఎంతవరకూ ప్రతిబింబించగలరనేది ప్రశ్నగా మారింది. ఇక ఈ చిత్రం కోసం ఇప్పటికే షిర్డీలో మ్యూజికల్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. కీరవాణి సంగీత దర్శకత్వంలో ఈ పాటలు ప్రాణం పోసుకుంటున్నాయి. భక్తికే ప్రాధాన్యత ఇచ్చి ఈ సినిమాని భక్తులను పరవసింపచేసేలా చేయటమే తన లక్ష్యమని అంటున్నారు నిర్మాతలు. దానికితోడు ఇన్నాళ్ళుగా భక్తి చిత్రాలకు కేరాప్ ఎడ్రస్ గా మారిన జె.కె భారవి ఈ చిత్రం స్క్రిప్టుని రాయటం లేదు. పరుచూరి బ్రదర్స్ ఈ భక్తి చిత్రానికి రచన చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇంతకీ విజయ్ చందర్ ఇమేజ్ లోంచి ప్రేక్షకులను బయిటకు తెచ్చి నాగార్జున తనదైన ముద్ర వేయగలడా లేదా అన్నది చూడాలి.












Click it and Unblock the Notifications