వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీలకంఠ తెలివిగా తీసిన సినిమా విరోధి

By Pratap
|
Google Oneindia TeluguNews

జాతీయ అవార్డు సాధించిన దర్శకుడు నీలకంఠ మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యగానే కాకుండా దేశసమస్యగా మారిన నక్సలిజాన్ని కథావస్తువుగా తీసుకుని ఆయన విరోధి సినిమా తీశారు. అయితే, నీలకంఠ ప్రతిభ అంతా ఆయన కథను నడిపించిన తీరులో వ్యక్తమవుతుంది. ఎటూ మొగ్గు చూపకుండా కథను నడిపించడం అంత తేలికైన విషయం కాదు. ఈ సినిమా నీలకంఠ మార్కును పట్టిస్తుంది. జయదేవ్ (శ్రీకాంత్) నిజాయితీ గల జర్నలిస్టు. అతను జంగయ్య అనే రాజకీయ నాయకుడి కుంభకోణాన్ని బయట పెడతాడు. అతనికి లంచం ఇచ్చి లోబరుచుకోవడానికి రాజకీయ నాయకులు ప్రయత్నిస్తారు కూడా. కానీ అతను లొంగిపోడు. ఈ స్థితిలో అవినీతిపరుడైన పార్లమెంటు సభ్యుడిని నక్సలైట్లు కిడ్నాప్ చేస్తారు. గోగి (అజయ్) నాయకత్వంలోని నక్సలైట్లు జయదేవ్‌ను కిడ్నాప్ చేస్తారు. ఇక్కడి నుంచి కథ వేగాన్ని అందుకుంటుంది.

నీలకంఠ విరోధి సినిమాలో నక్సలైట్ ఉద్యమానికి పూర్తి మద్దతుగానో, పూర్తి వ్యతిరేకంగానో కొట్టుకుపోలేదు. దానిలోని మంచీచెడులను ఎత్తి చూపుతాడు. ఈ ప్రయాణంలో జర్నలిస్టు కీలక పాత్ర పోషిస్తాడు. ఈ సినిమాలో అనూహ్యమైన మలుపులు, ఎత్తుగడలు లేకపోవడం విశేషం. కథ సూటిగా నడుస్తుంది. సినిమా సెకండాఫ్‌లో కథ మరింత వేగం పుంజుకుంటుంది. అత్యంత ఉద్వేగభరితమైన ఇతివృత్తాన్ని తీసుకుని సినిమాను నడిపించడం నీలకంఠకే చెల్లింది. ఉద్వేగంలో అతను కొట్టుకుపోలేదు. అదీ ఇక్కడ గమనించదగింది. దృశ్యమాధ్యమం విలువ తెలిసినవాడు కాబట్టి సినిమాను సంభాషణల ద్వారా కాకుండా భావోద్వేగాల ప్రదర్శన ద్వారా దర్శకుడు చూపించగలిగాడు. సంభాషణలు తక్కువగా ఉండి, హావభావాల ద్వారా వ్యక్తీకరణ ఎక్కువగా ఉంటుంది.

కథ బాగుండి, దర్శకుడు ప్రతిభావంతుడైనప్పుడు ఏ నటుడైనా తగిన విధంగా నటించగలుగుతాడనేది ఈ సినిమాను చూస్తే అర్థమవుతుంది. కుటుంబ కథా చిత్రాల్లో ఎక్కువగా నటించిన శ్రీకాంత్ ఈ సినిమాలో జర్నలిస్టుగా బాగా రాణించాడు. అజయ్, కమలినీ ముఖర్జీ కూడా ప్రతిభావంతంగా నటించారు. కథ ముందుకు సాగడంలో ఆర్పీ పట్నాయక్ సంగీతం విశేషమైన పాత్ర వహించింది. ఈ సినిమా గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మన తెలుగు సినిమా పెద్దలు దీని నుంచి ఏమైనా నేర్చుకుంటారా ఆసక్తి కొద్దే. ఆ మధ్య కాలంలో వచ్చిన గమ్యం సినిమా కూడా అత్యంత పకడ్బందీగా రూపుదిద్దుకుంది. దీంట్లో కూడా నక్సలైట్ ఉద్యమం గురించి ఉంది.

పరిణమాలకు, సంఘటనలకు వ్యక్తులు కాకుండా పరిస్థితులు ఎలా కారణమవుతాయనేది, ఆ సంఘటనలూ పరిణామాలూ మానవ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనేది ముఖ్యమైనప్పుడు మంచి సినిమాలు రూపుదిద్దుకుంటాయి. సామాజిక సమస్యలు, వివాదాస్పద విషయాలను ఇతివృత్తంగా తీసుకుని తక్కువ బడ్జెట్‌తో నష్టపోకుండా సినిమాలు తీయడం ఎలాగో తెలుగుకు కూడా పాకాలనేది ఈ సినిమా గురించి ప్రస్తావించడంలోని ఉద్దేశం. నక్సలిజం వంటి ఇతివృత్తాన్ని నిర్మమమకారంగా చిత్రీకరించడం నీలకంఠకే చెల్లిందని అనిపించడం కూడా ఇది రాయడానికి మరో కారణం.

English summary
Director Neelakantha's clever and neutral attitude reflected in Virodhi film. Dealing subject like naxalism is not easy for a director.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X