కొత్త సెన్సార్ రూల్స్ ఇవే

యు/ఎ స్థానంలో 12+, 15+ అని ఇచ్చే విధంగా మార్పు చేయాలని యోచిస్తోంది కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ. దీనిపై మన దర్శకనిర్మాతలు చర్చించారు. పన్నెండేళ్లు పైబడిన వారు చూడదగ్గ చిత్రాలు, పదిహేనేళ్లు పైబడినవారు చూడదగ్గ చిత్రాలుగా విభజించారు. ఇక ఎప్పట్లాగే 'ఎ' సర్టిఫికెట్ ఉంటుంది. ఇది పద్దెనిమిదేళ్లు పైబడిన వారు చూడాల్సిన చిత్రాలకు జారీ చేస్తారు. అయితే 'ఎ' అనే ముద్ర తీసేసి 18+ అని వేసుకొనేలా చేయాలనే సూచన కూడా చర్చకు వచ్చింది.
అలాగే కొందరు నిర్మాతలు యుఎ 9+, యుఎ 12+ అనే విభజన చేసి, ఆ తరహా చిత్రాల్ని పెద్దలతో కలిసి పిల్లలు చూసేలా చేయాలనీ, 15+ అని మరో సర్టిఫికెట్ ద్వారా ఆ వయసు పైబడ్డ వాళ్లను చిత్రానికి అనుమతించాలనీ సూచించినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications