పోగొట్టుకుంటున్న చోటే వెతుక్కుంటున్న జూ. ఎన్టీఆర్
ఎక్కడ పోగొట్టుకుంటే...అక్కడే వెతుక్కోవాలి. శక్తి సినిమా భారీ ప్లాపు తర్వాత చాలా డిస్పప్పాయింట్ గా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పడు ఇదే సూత్రాన్ని ఫాలో అవుతూ మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉన్నాడు. గతంలో జూనియర్ ఎన్టీఆర్-దర్శకుడు సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన 'అశోక్" సినిమా భారీ పరాజయం చవి చూసింది. ఇప్పడు అదే సురేందర్ రెడ్డితో 'ఊసరవెళ్లి"గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు జూనియర్ . సురేందర్‌రెడ్డి ఆ మధ్య 'కిక్" లాంటి భారీ సినిమా తీయడం జూనియర్‌ను ఆకట్టుకుంది. అందుకే గతంలో ఆయనతో జరిగిన పరాజయాన్ని మరిచి పోయి మళ్లీ సినిమా చేస్తున్నాడు.
మరో వైపు అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్- పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన 'ఆంధ్రావాలా" కూడా ఎన్టీఆర్ కెరీర్ లో భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఇప్పడు అదే పూరితో మరో సినిమా చేయడానికి సిద్దమయ్యాడు ఎన్టీఆర్. దాదాపు 8 ఏళ్ల తర్వాత మళ్లీ వీళ్ల కాంబినేషన్లో సినిమా రాబోతోంది. బండ్ల గణేష్ నిర్మించ బోతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సెట్స్ మీదకు రానుంది.
పొగొట్టుకున్న చోటే వెతుకున్న చందందా....పరాజయాలు చవిచూసిన వారితోనే హిట్టు కొట్టాలని ఉవ్విల్లూరుతున్న జూనియర్ ఆకాంక్ష ఫలిస్తుందో..? మళ్లీ బెడిసి కొడుతుందో? వెయిట్ అండ్ సీ.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications