పవర్ లేని పవర్ స్టార్ : ఆరిపోకముందే తేరుకుంటాడా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా తెరంగ్రేటం చేసిన ఈ హీరో తన పవర్ పుల్ మ్యానరిజంతో యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. పవర్ స్టార్ గా నీరాజనాలు అందుకున్నాడు. తన సినీ కెరియర్ లో విజయాలు కేవలం వేళ్లపై లెక్కించగలిగేవిగా ఉన్నా....దాదాపు పదేళ్లుగా ఈ స్టార్ వెలుగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికీ యువతలో ఇంత క్రేజీ స్టార్‌గా ఉన్నాడంటే కారణం అతని ఆటిట్యూడే. ఆయన లైఫ్ స్టయిల్‌కి తోడు, అందుకు తగిన విధంగానే ఆయన సినిమాలు ఉంటాయి. పవన్ నటించిన బద్రి, తమ్ముడు, తొలి ప్రేమ, ఖుషి, జల్సా లాంటి చిత్రాలు అంత పెద్ద హిట్టయ్యాయంటే...అది కేవలం పవన్ మ్యానరిజం వల్లనే. అలాంటి స్టయిల్ టాలీవుడ్‌లో మరే హీరోకి లేదనే చెప్పాలి.
అయితే రాను రాను పవర్ స్టార్‌లో పవర్ తగ్గిపోతోందా? రోజురోజుకు ఈ స్టార్ వెలుగులు మసకబారుతోందా? త్వరలోనే పవర్ స్టార్ తెర మరుగు కాబోతున్నాడా? అంటే అవునే అనుమానం, ఆందోళన వ్యక్తం అవుతోంది అభిమానుల నుంచి. జల్సా తర్వాత పవన్ కళ్యాణ్ కెరీర్ ఒక్కటంటే ఒక్క హిట్ లేదు. స్టార్ రేసులో పవన్ బాగా వెనకబడి పోయాడు. అసలు పవన్ కళ్యాణ్ గురించి ఇండస్ట్రీలో ఏమంత పెద్దగా హాట్ చర్చ లేదంటే...పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. దీనికితోడు ఆయన వయసు కూడా పెరిగి పోతోంది. ఇక్కడ వయసు పెద్ద కారణం కాక పోయినా..ఆయనే చాల్లా స్లో అయ్యాడనే చెప్పాలి.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ విష్ణువర్ధన్ దర్శకత్వంలో కాళీ(వర్కింగ్ టైటిల్) అనే చిత్రాన్ని చేస్తున్నప్పటికీ, ఆ సినిమా పరిశ్రమలో ఏమంత పెద్ద హైప్ పెంచడం లేదు. 'గబ్బర్ సింగ్" హిందీ దబాంగ్ రీమేక్ కావడంతో దానిపై పెద్ద గా ఆసక్తతి లేదు సినీ జనాల్లో. మరి ఇది ఆందోళన పడాల్సిన అంశమే. మరో వైపు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్స్ టాలీవుడ్ రేసులో పవన్‌ను వెనక్కినెట్టి దూసుకెలుతున్నారు. మరి ఈ పరిస్థితి త్వరగా గమనించి పవర్ స్టార్ స్పీడు పెంచితే తప్ప లాభఢం లేదు. పరిశ్రమలో వరుస సినిమాలతో స్పీడుగా ఉన్నప్పుడే ఏ స్టారయినా వెలుగులీనుతూ ఉంటాడు. ఈ విషయాన్ని గ్రహించక పోతే ఏ స్టార్ అయినా ఆరి పోక తప్పందంటున్నారు సినీ విశ్లేషకులు.












Click it and Unblock the Notifications