రామ్ చరణ్..బచ్చా చేష్టలు

చరణ్ ఈ ఆడియో వేడకలో మాట్లాడుతూ...'తెలుగు హీరోలు మంచి నటులే కాక పోతే సూర్యతో పోల్చుకునేంత సీన్ లేదు" అనే విధంగా మాట్లాడాడు. చరణ్ ప్రవర్తన తెలుగు నటులను అవమాన పరిచే విధంగా ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇదే కాకుండా సెవెన్త్ సెన్స్ దర్శకుడు మురుగదాస్ ను చరణ్ పబ్లిగ్గా బెగ్గింగ్ చేశారు. మీ సినిమాలో ఛాన్స్ ఇవ్వాలంటూ అడుక్కున్నాడు. ఇలా ప్రవర్తించడం మెచ్యూరిటీ ఉన్న హీరో లక్షణాలు కాదంటున్నారు సినీ పెద్దలు. ఈ విషయం తెలిసిన చిరంజీవి చరణ్ కు ప్రత్యేకంగా క్లాస్ పీకినట్లు సమాచారం. పరిశ్రమలోకి వచ్చి ఇన్నేళ్లయినా చరణ్ ఇంకా బచ్చా హీరోలా వ్యవహరించడం ఏమిటని చాలా మంది విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications