కొండవీటి రాజాలతో షోకుల రాణులు

ఈ రియాల్టీ షో కాన్సెప్ట్ ఏంటంటే... అడవిలో హాయిగా తమ పనులు తాము చేసుకునే గిరిజనులును పట్నం తీసుకు వచ్చి వారికి పట్నం అమ్మాయిలను పార్ట్‌నర్‌గా చేసి వివిధ రకాల పరీక్షలు పెట్టడం. చివరిగా ఎవరు నెగ్గుతారో... వారే కొండవీటి రాజా... కోటలో రాణి. కాన్సెప్ట్ వినడానికి బాగానే ఉంది కానీ.. నైతిక విలువల ప్రకారం చూస్తే.. ఏమీ తెలియని గిరిజనుల అమాయకత్వాన్ని మరో కోణంలో చూపించి నవ్వుకునేలా చేయడం ఇందులో దాగున్న రహస్యం.
లుంగీ, చొక్కా తప్పా జీన్స్, టీ-షర్ట్‌ల గురించి తెలియని వారికి ఆ దుస్తులు వేయించడం, అసలు చదువు అంటే తెలియని గిరిజనుల చేత ఇంగ్లీషు పద్యాలు చెప్పించడం. వారు తప్పులు చేస్తుంటే చూసి పకా పకా నవ్వుకోవడం ఇది దీని అసలు కాన్సెప్ట్. అంతటితో ఆగిపోయితే సరి, హవ్వ... ఈ షోలో పాల్గొన్న యువతులు మాట్లాడే అసభ్య పదజాలాన్ని వింటుంటే.. హరి హరీ.. చెప్పడానికి తెలుగు భాషలో మాటలే ఉండవని చెప్పాలి. స్పోర్టివ్‌గా తీసుకోవాల్సిన ఆటల్లో ద్వేషంతో వ్యవహరించండమేంటి..? సిగ్గు.. సిగ్గు.. ఇలాంటి షోలు సమాజంలో విష బీజాలను నాటడం ఖచ్చితమని మానవ హక్కుల సంఘాలు ఘోషిస్తున్నా.. మనం మాత్రం వీటని చూసి ఎంజాయ్ చేస్తుంటాం...!
ఇలాంటిదే "ప్యాటి హుడిగిరో.. హల్లీ లైఫు" (సిటీ అమ్మాయిలి... పల్లె జీవనం) అనే మరో రియాల్టీ షో "సువర్ణ కర్ణాటక" అనే ఓ కన్నడ టెలివిజన్ ఛానెల్‌లో ప్రాసారం అవుతుంది. అయితే దీని కాన్సెప్ట్ మన కొండవీటి రాజా కోటలో రాణికి పూర్తిగా రివర్స్. ఇక్కడ పట్నం నుంచి వచ్చిన 12 మంది అమ్మాయిలతో ఉత్తర కర్ణాటకలో మారుమూల కుగ్రామంలో గొడ్డు చాకిరి చేయించడం ఈ రియాల్టీ షో అసలు కాన్సెప్ట్. అక్కడ ఎదురయ్యే కష్టనష్టాలను తట్టుకొని ఎవరు నిలబడుతారో వాల్లే విన్నర్స్ అన్నమాట. అమ్మాయిలతో పని చేయించే మాట అలా ఉంచితే పల్లె జీవనం ఎంత కష్టంగా ఉంటుందో.. అలాగే ఎంత అందంగా ఉంటుందో చూపించడం ఈ రియాల్టీ షో ప్రత్యేకత.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications