శారీరక రుగ్మతలను సైతం అధిగమిస్తున్న మానసిక ఒత్తిడి!

Stress tops Reason for Sick Leave
ఉద్యోగస్తులలో చాలా మంది సగటున సంవత్సరానికి సుమారుగా 11 వారాల పాటు సిక్ లీవ్ పెట్టేస్తున్నారని దీనికి కారణం ఉద్యోగాల్లో వారిలో వారు లేదా బాసులతో వారు కలహించటం, ఒకరినొకరు బాధించటం, అధికమైన పని మొదలైన ఒత్తిడులేనని నిపుణులు చెపుతున్నారు. పని చేస్తున్న జనాభాలో 20 శాతం మంది తీవ్ర డిప్రెషన్ కు గురవుతున్నట్లుగా కూడా గణాంకాలు చెపుతున్నాయి. పనిలో దీర్ఘ కాలం డుమ్మా కొట్టెయ్యటానికి కారణం శారీరక బాధలు కంటే కూడా మానసిక ఒత్తిడులేనని సిడ్నీ లోని ఒక రీసెర్చి తెలుపుతోంది.

ఆస్ట్రేలియాలోని బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ పబ్లకేషన్ మేరకు మానసిక ఒత్తిడుల కారణంగా 55 శాతం మంది ఒకే సారి అయిదు రోజుల వరకు కూడా సెలవు పెడుతున్నారని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ లో తెలిపింది. కొద్దిపాటి డిప్రెషన్ కు గురైన పని వారు రెండు సార్లకు మించి కూడా వారం రోజుల పాటు సిక్ లీవ్ పెడుతున్నట్లు అధ్యయనం చెపుతోంది.

మానసిక ఒత్తిడుల తర్వాత సాధారణంగా ఉద్యోగస్తులు ఎముకలు విరిగినాయంటూ (ఫ్రాక్చర్స్) ఒకే మారు ఒక వారం కంటే కూడా అధికంగానే సెలవు తీసుకుంటున్నారని ఈ రీసెర్చి వెల్లడించింది. రహస్యం తెలిసింది కనుక, కార్యాలయాలు సరి అయిన పరిష్కారం చూపిస్తాయో ఏమో కూడా చూడాలి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+