తెలుగు హీరోల ‘పంచుకుందాం రా’ ఫార్ములా

గతంలో ఒకరిఃతో ఒకరు సంబంధం లేకుండా పోటీ పడి సినిమాలు విడుదల చేసుకునే వారు. ఒక్కోసారి పెద్ద హీరోల సినిమాలు ఒకే తేదీన విడుదలయ్యేవి. ఈ తరుణంలో ఏ సినిమా బాగుంటే ఆ సినిమా మాత్రమే బాగా నడిచేది. కొంచెం నెగెటివ్ టాక్ వచ్చిన సినిమాకు నష్టాలు తప్పేవి కావు. ఏళ్ల తరబడి ఇలా హీరోలు పంతాలకు పోతూ కొన్ని సార్లు నష్ట పోయే వారు. మరికొన్ని సార్లు లాభ పడేవారు. ఈ ధోరణి తెలుగు సినీ వ్యాపారానికి అంత మంచిది కాదనే నిర్ణయానికి వచ్చిన కొందరు పెద్దలు హీరోల మధ్య సినిమా విడుదల విషయాల్లో మంచి అండర్ స్టాండింగ్ తీసుకువచ్చారు.
ఏ ఇద్దరు హీరోల సినిమా అయినా ఒకే సమయంలో విడుదల చేసుకోకుండా చేయడమే ఫార్ములా ప్రధాన లక్ష్యం. సినిమాకు సినిమాకు కనీసం రెండు వారాల గ్యాప్ ఇవ్వాలి. ఇలా చేయడం ద్వారా నెగెటివ్ టాక్ వచ్చినా ఓపెనింగ్ కలెక్షన్ లతో నిర్మాతలు గట్టెక్కుతారనేది వారి ఆలోచన. ఈ ఫార్ములా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ప్రయోగించారు. మహేష్ బాబు నటించిన దూకుడు సినిమా సెప్టెంబర్ 23న విడుదలయింతే, అందుకు రెండు వారాల గ్యాప్ తో అక్టోబర్ 6న జూనియర్ ఎన్టీఆర్ ఊసరవెల్లి సినిమా విడుదలవ్వబోతోంది. శ్రీరామ రాజ్యం షూటింగ్ ఎప్పుడో పూర్తయినా...అక్టబర్ 26 వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. అంటే ఊసరవెల్లి సినిమాకు శ్రీరామ రాజ్యం సినిమాకు మధ్య గ్యాప్ 20 రోజులు. నాగార్జున రాజన్న సనిమా సైతం మరింత గ్యాప్ తో డిసెంబర్ లో విడుదల చేస్తున్నారు. ఇందంతా ఆయా సినిమాల నిర్మాతలు, హీరోల మధ్య కోపరేషన్ వల్లనే సాధ్యం అంటున్నారు.
పరిశ్రమలోని హీరోల మధ్య ఇంత బీభత్సమైన కో ఆపరేషన్ ఉండటం చూసి ఆశ్యర్య పోతున్నారంతా. మరి ఈ రకమైన స్నేహ పూర్వక వాతావరణ ఎంత కాలం కొనసాగుతుందో చూడాలి...
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్












Click it and Unblock the Notifications