ఎక్కువ రోజులు కొనసాగుతున్న అతిధిని సాగనంపటం ఎలా?

-మీ అతిధి కనుక ఫోన్ చేసి తాను వస్తున్నానని చెపితే, అతనికి ముందుగా మీకు గల అపాయింట్ మెంట్లు తెలుపండి. ఉదాహరణకు ఆదివారం వస్తున్నానని చెపితే, ఆ రోజు సాధారణంగా మీరు లేటుగా నిద్ర లేవాలనుకుంటారు. అందుకని ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు రావలసినదిగా సూచన ఇవ్వండి.
-ఒక వేళ మీ అతిధి కనుక మరో రెండు రోజుల పాటు వుండిపోదలిస్తే, మీకు వారాంతపు సెలవులలోనే కలిసి ఆనందించటం కుదరగలదని తెలుపండి. దీనితో పని దినాలలో మీరు బిజీగా వుంటారన్న విషయం అతనికి అర్ధం అవుతుంది.
-అదే రకంగా మీ ఇంటి నిబంధనలు సైతం అతిధికి తెలియజేయండి. ఎందుకంటే, కొంతమంది మీ ఇంటి అలవాట్లకు అసౌకర్యం భావించి త్వరగా వెళ్ళి పోయే అవకాశం కూడా వుంది.
-మీకు ఎవరైనా అతిధి యొక్క ప్రవర్తన నచ్చకపోతే, అతనికి మీరు ఆ విషయం తెలియపరచాలి. అతను ఏదైనా చేయరాని పని చేసినా లేదా చెప్పినా దాని ప్రభావం మీ ఇంటిలోని పిల్లలపై తప్పక పడగలదు. అందుకని ఆ విషయం వారికి చెప్పాలి.
-వచ్చిన అతిధి ప్రవర్తన ఎలా వుందనే దానిపై బాహాటంగా వ్యవహరించండి. అతనిని అభినందించాల్సి వచ్చినా సరే లేదా విమర్శించాల్సి వచ్చినా సరే దానిని తెలుపటం మంచిది. దీనితో వచ్చిన అతిధి మీరు ఏదైనా ఆమోదించేస్తారనే భావనకు దూరంగా వుంటాడు.
-వచ్చిన అతిధితో వీలైనంత మేరకు మీరు బయటి పనులు నిర్వహించుకుంటూనే అతనిని షికార్లకు తిప్పండి దానితో అతిధి కొరకు మీరు పూర్తిగా టైమును కేటాయించనవసరం లేదు. బయటకు వెళ్ళినపుడు అతని ఖర్చులు మీరు భరించకండి. ఆటో ఛర్జీలు, లేదా బస్ టికెట్లు తాను తీసుకుంటానంటే అంగీకరించండి. వచ్చిన ప్రతి అతిధి ఎంతో కొంత మీతో ఖర్చు పెట్టించాలనే చూస్తాడు.
-వచ్చిన అతిధితో మీరు ఎంత సంతోషంగా వున్నారో, మరల అతనిని ఏ విధంగా స్వాగతిస్తారో అతనికి తెలియజేయండి. దీనితో అతను వెళ్ళే సమయం వచ్చినట్లు సూచించినట్లవుతుంది.
అతిధి వస్తే ఆనందమే. అయితే వారితో పాటు మనం కూడా అలసి పోయే ప్రమాదముంది. ఈ టిప్స్ కనుక ఆచరిస్తే, మీకు పెద్ద భారం లేకుండా వారి రాకను ఆనందించటమైనట్లవుతుంది.












Click it and Unblock the Notifications