టాలీవుడ్ హీరోలకు ఆ సాహసం లేదా?

టాలీవుడ్ హీరోల సంగతి ఇలా ఉంటే....మన పొరుగు పరిశ్రమలై హిందీ, తమిళ సినిమా పరిశ్రమల నుంచి మన రోటీన్ సినిమాలకు పూర్తి భిన్నమైన సినిమాలతో టాలీవుడ్ పై దండెత్తి హిట్లమీద హిట్లు కొట్టడమే కాదు తెలుగు ప్రేక్షకులతో శభాష్ అనిపించుకుంటున్నారు. ఆ మధ్య విక్రమ్ హీరోగా వచ్చిన అపరిచితుడు, శివపుత్రుడు, ఇటీవల వచ్చిన నాన్న, సూర్య హీరోగా వచ్చిన గజిని, విశాల్ హీరోగా వచ్చిన 'వాడువీడు" సినిమాలు ఆ కోవలోకే వస్తాయి. బాలీవుడ్ అగ్రహీరో అమీర్ ఖాన్ తారే జమీన్ పర్, అమితాబ్ 'పా" లాంటి వివైద్యమైన సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే.
మరి ఎందుకు తెలుగు సినిమా నుంచి అలాంటి సినిమాలు రావడం లేదు? కథలు లేవా? దర్శకులు లేరా? అంటే.....అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది ఇక్కడి పరిస్థితి. ప్రయోగాలు, వైవిద్యమైన కథలు చేయడానికి మన పరిశ్రమలో పేరున్న హీలు ముందుకు రాక పోవడమే ఇందుకు కారణం అనే సమాధానం దర్శకులు, రచయితల నుంచి వినిపిస్తోంది. కొత్త వారిని పెట్టి తీద్దాం అంటే అందుకు నిర్మాతలు ఎవరూ ముందుకు రారు. అలా అందరూ అలాంటి వారే అని మా ఉద్దేశ్యంకాదు. కొందరు ఉన్నప్పటికీ..ఆ కొందరి వల్ల విప్లవాత్మక మార్పులు రావు అనేది ఇక్కడ అసలు ఉద్దేశ్యం. ఈ పరిస్థితిలో మార్పురావాలంటే.....వారి ఆలోచనల్లో మార్పురావాలి. కమర్షియల్ గా డబ్బులు దండుకునే చెత్త ఐడియాలను పక్కన పెట్టి....ప్రేక్షకులకు నచ్చేవిధంగా విలువలతో కూడిన సినిమాలు తీయాలి. అప్పుడే మన పొరుగు పరిశ్రమల నుంచి పోటీని తట్టుకుని నిలబడగలుగుతాం.












Click it and Unblock the Notifications