హజారే పేరుతో.. తెలుగు హీరోల పబ్లిసిటీ స్టంట్!

అయితే టాలీవుడ్ హీరోల హడావుడి అంతా మాటల్లో తప్ప, చేతల్లో కనిపించడం లేదు. అన్నా హజారే పోరాటానికి మద్దతుగా తెలుగు సినిమా పరిశ్రమ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన శాంతిర్యాలీ, నిరసన కార్యక్రమానికి అగ్రహీరోలు, యువ హీరోలు హాజరు కాక పోవడమే ఇందుకు నిదర్శనం. ఎవరూ రాక పోవడంతో భారీ ఎత్తున నిర్వహించి తెలుగు సినీ పరిశ్రమ పవరేంటో చూపిద్దామని అనుకున్న సీని పెద్దలకు నిరాశే ఎదురైంది.
ఈ రోజు జరిగిన కార్య్రకమంలో దాసరి, మురళీ మోహన్, జీవిత, రాజశేఖర్, పరుచూరి లాంటి ప్రముఖులు మినహా ఇతర అగ్రనటులు, యువ హీరోలు ఎవ్వరూ హాజరు కాలేదు. క్రికెట్ మ్యాచ్‌లు లాంటి కార్య్రక్రమాలు జరిగితే ఓ....ఎగేసుకుంటే వచ్చే వీళ్లంతా, అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న మంచి పనిలో ప్రతక్ష్యంగా పాలు పంచుకోక పోతుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications