డర్టీ పిక్చర్: సిల్క్ స్మిత మృత్యు రహస్యం?

కొన్ని సందర్భాల్లో హీరోయిన్ల కన్నా ఎక్కువ పారితోషికం తీసుకున్న సిల్క్ స్మిత జీవితం విషాదాంతమైంది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆ మృత్యువు ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఆమె మరణంపై ఇప్పటికీ ఊహాగానాలు చెలరేగుతూనే ఉన్నాయి. డర్టీ పిక్చర్ కేవలం సిల్క్ స్మిత నట జీవితంపైనే కాకుండా వ్యక్తిగత జీవితంపై కూడా దృష్టి సారించినట్లు చెబుతున్నారు. దాంట్లో ఆమె మృత్యు రహస్యాన్ని విప్పే ప్రయత్నం కూడా చేసినట్లు చెబుతున్నారు. అయితే, సిల్క్ స్మిత జీవితంపై తమను సంప్రదించకుండానే సినిమా తీస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే, సిల్క్ స్మిత బాయ్ ఫ్రెండ్ ఒకరితో మాట్లాడి రజత్ అరోరా స్క్రిప్టును తయారు చేశారని, అందులో సిల్క్ స్మిత మరణం కూడా ఉంటుందని అంటున్నారు.
సిల్క్ స్మిత జీవితం కష్టాల్లోనే సాగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించిన సిల్క్ స్మిత పేదరికంతో కొట్టుమిట్టాడింది. ఆమె తండ్రికి ఇద్దరు భార్యలు. ఈమె మొదటి భార్య కూతురు. నాలుగో తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పి హీరోయిన్ కావాలనే ఉద్దేశంతో చెన్నైలో కాలు పెట్టింది. కానీ, ఆమెకు అది సులభం కాలేదు. మేకప్ ఉమెన్‌గా రంగ ప్రవేశం చేసింది. బి గ్రేడ్ నటులకు ఆమె మేకప్ చేసేది. ఆ సమయాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ పోయింది. అదే సమయంలో ఆమెకు ఓ మలయాళీ సినిమాలో బార్ గర్ల్ పాత్ర వచ్చింది. దాంతో విజయలక్ష్మి కాస్తా సిల్క్ స్మితగా మారింది. ఆమె కెరీర్ మలుపు తిరిగింది. బార్ గర్ల్‌గా నటించడంతో ఆమె సినిమాల్లో ఐటం గర్ల్‌గా స్థిరపడాల్సి వచ్చింది. 1970 దశకంలో చిత్ర సీమలోకి అడుగు పెట్టిన సిల్క్ స్మిత 450 సినిమాల్లో తన సత్తా చాటింది. జీవితం సినిమాల్లో ఐటం గర్ల్‌గా చేస్తున్న కాలంలోనే 1996లో ఆమె జీవితం ఆకస్మికంగా ముగిసింది. సినీ రంగంలో ఓ సంచలనం సృష్టించిన సిల్క్ స్మిత జీవితం ఇప్పటికి ఓ సినిమాకు కథావస్తువైంది. ఆమెను సినిమాలో ఎలా చూపిస్తారనేది ఆసక్తికరంగానే ఉంది. ఆ డర్టీ పిక్చర్ సినిమా డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications