అసీం త్రివేది ఇష్యూపై సురేంద్ర: భయపెట్టడానికే...

"అసీం త్రివేది ప్రొఫెషనల్ కార్టూనిస్టు కాడు. యాక్టివిస్టు కార్టూనిస్టు. అసీం త్రివేది వేసిన కార్టూన్లు ఏ పత్రికలోనూ వేసుకోవడానికి కుదరవు. బ్యాడ్ టేస్టు కార్టూన్లు. వాటిని వేసుకోవడానికి ఏ పత్రికలో కూడా అచ్చు వేయడానికి కుదరదు. రాజద్రోహం అనే పదానికి అర్థం తెలుసుకోకుండా అసీం త్రీవేదిపై కేసు పెట్టారు. కార్టూన్సుకు ఆ కేసుకు సంబంధం లేదు. అతను ఒక్కడిని లొంగదీసుకోవడానికి ఆ కేసు పెట్టలేదు. మిగతావారిని భయపెట్టడానికి ఆ కేసు పెట్టారు.
నిజానికి, అసీం త్రివేదిని మిగతా కార్టూనిస్టుల సరసన కూర్చోబెట్టి చూడడం సరి కాదు. ఉద్యమానికి సంబంధించిన కార్టూన్లే అతను వేస్తాడు. దాన్ని ఆపలేరు కూడా. ప్రజాస్వామ్యంలో మనకు నచ్చనివి చాలా జరుగుతుంటాయి. అంత మాత్రాన రాజద్రోహం కేసు పెట్టి వేధించడం సరి కాదు. వినాయక్ సేన్ మీద పెట్టినట్లే అసీం త్రివేది మీద కేసు పెట్టారు. మిగతావారిని భయపెట్టడానికే వినాయక్ సేన్ మీద కేసు పెట్టారు. అలాగే ఇది కూడా.
అసీం త్రివేది చెప్పిన విషయాల మీద ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ చెప్పిన పద్ధతే బాగా లేదు. చిన్న కారణం మీద ఇంత పెద్ద కేసు పెట్టడం కూడా సరి కాదు. యాక్టివిస్టు కార్టూనిస్టును, ప్రొఫెషనల్ కార్టూనిస్టులను ఒకే గాట కట్టేడయం సరి కాదు. సోషల్ నెట్‌వర్క్‌లో మాత్రమే ఆసీం త్రివేది వేసినలాంటి కార్టూన్లు వచ్చే వీలుంది. ప్రింట్ మీడియాలో గానీ విజ్యువల్ మీడియాలో గానీ అటువంటి వచ్చే అవకాశం ఏ మాత్రం లేదు.
ఏమైనా అంటే పాశ్యాత్య దేశాల్లో వచ్చే కార్టూన్ల గురించి మాట్లాడుతున్నారు. బట్టలు విప్పేసి నగ్నంగా అక్కడ కార్టూన్లు వేస్తారని మాట్లాడుతారు. మనది అంత లిబరల్ వ్యవస్థ కాదు. అలా వేయడానికి భారతదేశంలో కుదరదు.
- సురేంద్ర, కార్టూనిస్టు, ది హిందూ దినపత్రి, చెన్నై
"మనం స్పేచ్ఛా ప్రపంచంలో నివసిస్తున్నామా, నియంతృత్వంలో ఉన్నామా? మమతా బెనర్జీ కార్టూనిస్టును అరెస్టు చేయించారు, ఇప్పుడు ముంబై పోలీసులు మరో కార్టూనిస్టును అరెస్టు చేశారు. అసెంబ్లీలో పోర్న్ చూడడం నేరం కాదా? పార్లమెంటులో చేయి చేసుకోవడం నేరం కాదా? జాతీయ జెండాను గానీ జాతీయ చిహ్నాన్ని గానీ ఎవరు అవమానించకూడదు. ఆగ్రహానికి అది అభివ్యక్తి, అది అవమానించడం కాదు. కార్టూనిస్టు వ్యక్తీకరణకు ఎవరైనా బాధపడేవారు సిగ్గుపడాలి. వారి గురించి దేశం విచారం వ్యక్తం చేయాలి. అసీం త్రివేది ఓ కార్టూనిస్టు. కానీ రాజకీయ నాయకులు, అధికారులు కార్టూన్లకు మించిన క్యారెక్టర్లు".
మృత్యుంజయ, కార్టూనిస్టు, నమస్తే తెలంగాణ డైలీ
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications