సచిన్ టెండూల్కర్ స్థాయి తగ్గుతోందా?

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ టెస్టు మ్యాచుల్లో బాగా రాణించారు. కానీ వన్డేల్లో విఫలమవుతున్నాడు. ఈ స్థితిలో రికీ పాంటింగ్‌ను వన్డే సిరీస్ నుంచి వెంటనే తప్పించారు. పరిస్థితిని గుర్తించిన పాంటింగ్ - తాను వన్డేలకు స్వస్థి చెబుతున్నట్లు ప్రకటించాడు. రికీ పాంటింగ్‌తో పోలిస్తే టెండూల్కర్ ఆట తీరు అంత బాగా ఏమీ లేదు, అంతకన్నా దారుణంగానే ఉంది. అయినా టెండూల్కర్ జట్టులో కొనసాగుతున్నాడు. పైగా, మైదానంలోకి దిగే అవకాశాలను కొల్లగొడుతున్నాడు. ఈ స్థితిలో అత్యంత మర్యాదస్థుడైన సచిన్ టెండూల్కర్ చేయాల్సిందేమిటనేది చర్చనీయాంశంగా మారింది.
టెండూల్కర్ రిటైర్మెంట్ ప్రకటించాలని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. ప్రపంచ కప్ పోటీల తర్వాత టెండూల్కర్ తప్పుకోవాల్సి ఉండిందని ఆయన అన్నారు. వన్డేల్లోంచి సచిన్ తప్పుకోవాల్సిందని మరో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా సూచించాడు. మైలురాయిని చేరుకోవాలనే విషయాన్ని మనసు నుంచి తొలగించుకోవాలని కాస్తా మర్యాదగా రవిశాస్త్రి టెండూల్కర్‌కు సూచించారు. చాలా మంది మాజీ క్రికెటర్లు - టెండూల్కర్ విషయంలో తమ వాదన వినిపిస్తూనే ఉన్నారు.
ఆ మాటలను గానీ, వారి వాదనలను గానీ సచిన్ టెండూల్కర్ పట్టించుకోకుండా టెండూల్కర్ జట్టులో కొనసాగుతూనే ఉన్నారు. ఇలా కొనసాగడం వెనక బిజినెస్ లాబీ ఏమైనా ఉందా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏమైనా, సచిన్ టెండూల్కర్ తన ప్రతిష్టను తగ్గించుకునే విధంగానే వ్యవహరిస్తున్నాడనే అభిప్రాయం మాత్రం రోజురోజుకూ బలపడుతోంది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications