వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏ కారు పేరు చెప్పినా గాలి సొంతమే

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
ఏ కారు పేరు చెప్పినా, ఎంత లగ్జరీ కారు పేరు చెప్పినా కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి వద్ద ఉండి తీరాల్సిందే. గాలి జనార్దన్ రెడ్డి వద్ద ఉన్న కార్లను చూస్తే ఎవరికైనా ఈర్ష్య కలుగుతుంది. గాలి జనార్దన్ రెడ్డి నుంచి సిబిఐ అధికారులు కార్లను, హెలికాప్టర్లను స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ గత నాలుగున్నర నెలలుగా గ్యారేజీలో పడి ఉన్నాయి. నిరుడు సెప్టెంబర్‌లో అరెస్టు చేసిన తర్వాత గాలి జనార్దన్ రెడ్డి వాహనాలను సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

లగ్జరీ జీవనశైలికి అలవాటు పడిన గాలి జనార్దన్ రెడ్డి అత్యధునాతనమైన కార్లను సేకరించుకున్నారు. రోల్స్ రాయస్ ఫాంటోమ్, మాసెరెటి, మూడు కోట్ల రూపాయల విలువ చేసే కాంటినెంటల్ జిటి కోపియా, రూ. 3 కోట్ల రూపాయల ఖరీదు చేసే రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారు, మెర్సిడీస్ - బెంజ్ లిమోసైన్, టయోటా ల్యాండ్ క్రూయిజర్, ఆది, మిత్సుబిషి పజేరోస్ - గాలి జనార్దన్ రెడ్డి కార్ల జాబితా అని ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఓ వార్తాకథనంలో తెలిపింది. ఐదు కోట్ల రూపాయల విలువ చేసే వోల్వో బస్సు కూడా ఉంది. దానికి ముద్దుగా ఆయన రుక్మిణి అని పేరు పెట్టుకున్నారు. దాన్ని రాజకీయ ప్రచారానికి రోడ్ షోల్లో వాడేవారు. అతనికి డజనుకు పైగా దేశీయ కార్లున్నాయి.

అయితే, సిబిఐ చార్జిషీట్ ప్రకారం - రెండు ఖరీదైన విదేశీ కార్లు రోల్స్ రాయస్, మసేరతిలను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. రోల్స్ రాయస్ బళ్లారి పట్టణంలో రిజిస్ట్రేషన్‌తో ఉంది. మసెరతికి నెంబర్ లేదు. దాన్ని వాడినట్లు లేదని ఆంగ్ల పత్రిక రాసింది. సేఫ్ కస్టడీ కోసం సిబిఐ ఆ రెండు కార్లను పోలీసులకు అప్పగించింది. భద్రతా కారణాల వల్ల వాటిని సిబిఐ హైదరాబాదు కోర్టులో ప్రవేశ పెట్టలేదు.

English summary
Mining baron Gali Janardhan Reddy’s collection of luxury cars would make any millionaire go green with envy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X