ఎల్ఐసి ఇండియా కొత్త పాలసీ - జీవన్ వృద్ధి

సెక్యూరిటీ - సింగిల్ ప్రీమియమ్‌కు ఐదింతలు రిస్క్ కవర్‌ను అందిస్తుంది
పెరుగుదల - ఏమైనా ఉంటే (కార్పొరేషన్ అనుభవం ప్రాతిపదికగా) లాయల్టీతో ఆకర్షణీయమైన గ్యారంటీ మాచ్యురిటీ మొత్తాన్ని హామీ ఇస్తుంది.
సౌకర్యం - ఒకే విడత చెల్లింపు
స్వేచ్ఛ - అర్హత గలవారికి పెట్టుబడిపై గరిష్ట పరిమితి ఏదీ లేదు
లిక్విడిటీ - ఏడాది తర్వాత పాలసీ లోన్ అందుబాటు
పాలసీ అమలులో ఉన్న కాలంలో బీమా చేసిన వ్యక్తి దురదృష్టకరంగా మరణిస్తే ఏదైనా అదనపు ప్రీమియం ఉంటే దాన్ని మినహాయించి, సింగిల్ ప్రీమియమ్‌కు ఐదింతలు చెల్లించడం జరుగుతుంది. మాచ్యురిటీ తర్వాత హామీ ఇచ్చిన గ్యారంటీ మాచ్యురిటీ మొత్తాన్ని (చెల్లించాల్సిన సింగిల్ ప్రీమియమ్, హామీ ఇచ్చిన లైఫ్ ఎంట్రీని పరిగణనలోకి తీసుకుని) లాయల్టీ అడిషన్‌తో పాటు చెల్లించడం జరుగుతుంది. కార్పొరేషన్ అనుభవాన్ని, కొర్పోరేషన్ డిక్లేర్ చేసిన నియమాలు, రేట్లను పరిగణనలోకి తీసుకుని పాలసీ తుది ఏడాదిలో లాయల్టీ అడిషన్‌ను అర్హతను నిర్ణయిస్తారు.
పథక ప్రవేశానికి కనీస వయస్సు 8 ఏళ్లు (పూర్తయి ఉండాలి), గరిష్ట వయస్సు 50 ఏళ్లు (జన్మతేదీ సమీపంలో). పాలసీ కాలపరిమితి 10 ఏళ్లుగా నిర్ణయించడమైంది. కనిష్ట హామీ సొమ్ము రూ. 1.50 లక్షలు. అప్పర్ లిమిట్ ఏదీ లేదు. పాలసీ కనిష్ట ప్రీమియమ్ రూ. 30.000. వేయి రూపాయల చొప్పున పెరుగుతూ పోతుంది.
అన్ని గ్రూపులవారికి ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. యువతకు తమ తర్వాతి జీవితంలోని ప్రణాళికలకు, పెద్దలకు తమ పిల్లల చదువులకు, ఇతరత్రా అవసరాలకు ఈ ప్లాన్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పాలసీకి ఆదాయం పన్ను మినహాయింపు కూడా ఉంది. ఏడాది తర్వాత ఈ పాలసీ లోన్ రూపంలో పాలసీ హై లిక్విడిటీకి కూడా అవకాశం కల్పిస్తుంది.
ముంబై ఎల్ఐసి ఇండియా కేంద్ర కార్యాలయం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సిసి) ఈ పాలసీ వివరాలను వెల్లడించారు.












Click it and Unblock the Notifications