మిస్టరీ: రాజన్న కోడెల వరుస మృత్యువులు

రాజన్న కోడెలు మృత్యువాత పడుతున్నా ఆలయాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా గురువారంనాడు ఆరు రాజన్న కోడెలు మృత్యువాత పడ్డాయి. దీంతో ఈ మరణాల వెనక ఏదో మిస్టరీ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతుతున్నాయి. వేములవాడ శివారులోని జగిత్యాల బస్‌స్టాప్ సమీపంలోని గోశాల ఉంది. ఒక్కసారిగా ఆరు రాజన్న కోడెలు అనుమానస్పద స్థితిలో మృత్యువాత పడడం చర్చనీయాంశాంగా మారింది.
అయితే గోశాల సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా మృతి చెందిన కోడెలను గురువారం ఉదయం వేములవాడ మండలం అరెపల్లి గ్రామంలోని మూలవాగులో పడేయడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. గురువారం సాయంత్రం గోశాలలో పనిచేస్తున్న ఆలయ ఉద్యోగి ఒకరు మృతి చెందిన కోడెల చర్మాన్ని ఒలిచి అమ్మడానికి బేరసారాలు కుదుర్చుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి.
ఓ కసాయిని వెంట పెట్టుకొని మూలవాగులో కోడెల చర్మాన్ని ఒలుస్తున్నారు. ఇదే సమయంలో పత్తి చేనులో పనులు ముగించుకొని ఇంటి వస్తున్న రైతు ఈ సంఘటన చూసి చలించిపోయి, పత్తిచేనులోని మిగతా రైతులకు తెలియజేసినట్లు స్థానికంగా వార్తలు వచ్చాయి. దీంతో వారందరు కలసి మూలవాగు వెళ్లి చూడా రాజన్న కోడెలు అక్కడి పడి ఉన్నాయి. దీంతో సదురు కసాయిని, ఉద్యోగి వారికి సహకరించిన మరో ఇరువురిని గ్రామస్థులు, రైతులు చితకబాదారు.
ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. సంఘటన స్థలానికి చేరుకొని కసాయిని, ఆలయ ఉద్యోగి మైసయ్యను, మరో ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. ఏమైనా, కోడెల పోషణలో అశ్రధ్దతో పాటు మరేదైనా కారణం వాటి మృతి వెనక ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications