చిత్రాలు: విక్టరీలో యువరాజ్ సింగ్ హీరో
పూణే: ఇంగ్లాండుపై టెస్టు సిరీస్‌లో ఓటమిని చవి చూసిన తర్వాత భారత్‌కు గురువారం రాత్రి కాస్తా ఊరట లభించింది. ఇంగ్లాండుపై తొలి ట్వంటీ20 మ్యాచులో భారత్ ఘన విజయం సాధించింది. యువరాజ్ సింగ్ ఆల్ రౌండ్ ప్రతిభ కనబరిచి ఇండియాకు విజయాన్ని అందించాడు. అందుకు గాను అతను మ్యాన్ ఆఫ్ ద మ్యాచుగా ఎంపికయ్యాడు.
కేవలం 19 పరుగులు ఇచ్చి యువరాజ్ సింగ్ మూడు వికెట్లు తీసుకున్నాడు. ఇది ట్వంటీ20 మ్యాచుల్లో యువరాజ్‌ది అత్యుత్తమ ప్రదర్శన. ఇంగ్లాండు తమ ముందు ఉంచిన 157 పరుగుల లక్ష్యాన్ని భారత్ 17.5 ఓవర్లలో ఛేదించి ఐదు వికెట్ల విజయాన్ని అందుకుంది. ఇంగ్లాండు, ఇండియా మధ్య రెండో తుది ట్వంటీ20 మ్యాచ్ ఈ నెల 22వ తేదీన శనివారం ముంబైలో జరగనుంది.

యువరాజ్ సింగ్ 21 బంతుల్లో 38 పరుగులు చేసి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇంగ్లాండుపై విజయాన్ని భారత క్రికెట్ జట్టు సభ్యులు ఇలా పంచుకుంటున్నారు.

వికెట్ తీసుకున్న ఆనందాన్ని జట్టు సభ్యులతో పంచుకుంటున్న యువరాజ్ సింగ్

24 పరుగులు చేసి నాటవుట్‌గా మిగిలిన భారత కెప్టెన్ ఎంఎస్ ధోనీ షాట్ కొడుతూ ఇలా కనిపించాడు.

రవీంద్ర జడేజాతో కలిసి కెప్టెన్ ధోనీ ఇండియాను విజయ తీరాలకు చేర్చారు.

కెప్టెన్ ధోనీ తన బ్యాటింగులో ఇలా దృష్టి పెట్టాడు.

దూకుడుగా ఆడిన అజియంక రహనే 19 పరుగులు చేశాడు. బంతిని తరలిస్తూ ఇలా కనిపించాడు.

ఇంగ్లాండుకు భారీ స్కోరు సాధించి పెట్టడానికి అమితోత్సాహం ప్రదర్శించిన అలెక్స్ హేల్స్‌ను అవుట్ చేసిన ఆనందాన్ని యువరాజ్ సింగ్ దాచుకోలేకపోయాడు.

ఇంగ్లాండు బ్యాట్స్‌మన్ హేల్స్ 56 పరుగులు చేసి, యువీ బౌలింగులో పెవిలియన్ చేరుకున్నాడు.

తన 56 పరుగుల ఇన్నింగ్సులో ఓ బంతిని సిక్స్‌గా మలుస్తూ హెల్స్ ఇలా కనిపించాడు.

అలెక్స్ హేల్స్ బ్యాటింగ్ చేస్తూ ఇలా....

అవుట్‌కు అపీల్ చేస్తూ విరాట్ కోహ్లీ, ధోనీ ఇలా చేసినా, ఫలితం లేకపోయింది.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications