పోస్టాఫీసు పథకాలు, వాటి రకాలు

PPF
భారత ప్రభుత్వం అందిస్తున్న పోస్టాఫీసు పథకాలు అత్యంత విశ్వాసపూరితమైనవి, భద్రమైనవి. కొన్ని పథకాలకు ఆదాయం పన్ను మినహాయింపు కూడా ఉంది. మరో సౌకర్యం ఏమంటే - ఏ నగరాల్లోకైనా ఖాతాలను బదిలీ చేసుకోవచ్చు.

వివిధ పథకాలు

పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకం

నెలసరి ఆదాయం కోసం ఇది పనికి వస్తుంది. ఖర్చుల కోసం నెలసరి ఆదాయం కోరుకునే రిటైర్డ్ ఉద్యోగులకు, సీనియర్ పౌరులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. వడ్డీ రేట్లు 8.5 శాతం ఉన్నాయి. మాచ్యురిటీ కాలపరిమితి ఐదేళ్లు. ఆటో క్రెడిట్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఇన్వెస్టర్ల ఎస్‌బి ఖాతాలోకి నేరుగా డబ్బులు క్రెడిట్ అవుతాయి.

కనిష్ట, గరిష్ట పెట్టుబడి: సింగిల్ ఖాతా అయితే మినిమం ఇన్వెస్ట్‌మెంట్ రూ. 1500. గరిష్టంగా రూ.4.5 లక్షల రూపాయల వరకు అనుమతిస్తారు.

జాయింట్ ఖాతా అయితే కనిష్టంగా 1500 రూపాయలు, గరిష్టంగా 9 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ పథకాల వల్ల పోస్టాఫీసు సేవింగ్స్ బ్యాంకు ఖాతాలోకి డబ్బులు వాటంతటవే వచ్చి పడుతాయి.

పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ (టిడి) పథకం

ఏ ఒక్కరైనా (ఒక వయోజనుడు లేదా ఇద్దరు వయోజనులు సంయుక్తంగా) ఖాతా తెరవవచ్చు. డిపాజిట్ల కాలపరిమితి ఏడాది. రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్లకు ఉంది. వడ్డీ రేటు 7.7 శాతం, 7.8 శాతం, 8.5 శాతం. ఒకటి, రెండు, మూడు, ఐదేళ్లకు మూడు నెలలకోసారి కాంపౌండ్ అవుతుంది. డిపాజిట్ ఐదేళ్లకు పెడితే ఆదాయం పన్ను చట్టం, 1961 సెక్షన్ 80సి కింద ఆదాయం పన్ను మినహాయింపు ఉంటుంది.

ఖాతాల కాలపరిమితి: 1,2,3,5 ఏళ్ల టిడిఎస్, కనిష్టంగా డిపాజిట్ రూ. 200, ఆ తర్వాత అది రెండింతలవుతుంది. గరిష్ట మొత్తంపై ఏ విధమైన ఆంక్షలు లేవు

పోస్టాఫీసు పొదుపు ఖాతా

ఓ వ్యక్తి అయినా ఖాతా తెరవవచ్చు. సంస్థాగత ఖాతాలు, సెక్యూరిటీ డిపాజిట్, అధికార స్థాయి వంటి ఖాతాలు - ఇవన్నీ గ్రూపు ఖాతాలు. వీటిని అనుమతించరు. ప్రస్తుతం వార్షిక వడ్డీ రేటు 4 శాతం. త్వరలో సవరించే అవకాశాలున్నాయి.

జాతీయ పొదుపు సర్టిఫికెట్

సీనియర్ పౌరుల పొదుపు వథకం (ఎస్‌సిఎస్ఎస్) ఖాతా

అరవై, ఆ పైబడి వయస్సుగల వ్యక్తులు ఈ ఖాతాను తెరవవచ్చు. స్వచ్ఛంద పదవీ విరమణ పథకం కింద లేదా ప్రత్యేక స్వచ్ఛంద పదవీ విరమణ కింద పదవీ విరమణ చేసిన మూడు నెలలలోగా, 60 ఏళ్లకు తక్కువ, 55, ఆ పైబడి ఉన్నవారు కూడా ఈ ఖాతా తెరవవచ్చు. రక్షణ సేవా రంగంలో పని చేసిన పదవీ విరమణ చేసిన అధికారులకు, ఇతర షరతులను భర్తీ చేస్తే వయోపరిమితి లేదు.

ఈ పథకం కింద డిపాజిట్ చేస్తే ఆదాయం పన్ను చట్టం, 1961, 80సి కింద 2007 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆదాయం పన్ను మినహాయింపు ఉంది.

సీనియర్ పౌరులకు తమ దినసరి ఖర్చుల కోసం నెలసరి ఆదాయం చాలా అవసరం. ఇటువంటివారికి నెలసరి ఆదాయం పథకం (ఎంఐఎస్) బాగుంటుంది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్) ఖాతా

ఇది వేతనజీవులకు, స్యయం ఉపాధి వర్గాలకు అత్యంత ప్రయోజనకారిగా ఉంటుంది. దీర్షకాలిక పెట్టుబడి మంచిది. ఓ వ్యక్తి ఏడాదికి లక్ష రూపాయల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఐటి చట్టంలోని 80సి సెక్షన్ కింద ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే పన్ను రిబేట్ లభిస్తుంది. ప్రస్తుతం వడ్డీ రేటు 8.8 శాతం ఉంది. ఈ పథకం కాలపరిమితి 15 ఏళ్లు. మూడేళ్ల తర్వాత రుణం తీసుకునే సౌకర్యం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+