'ధోనీది అదృష్టమే... కెప్టెన్‌గా కోహ్లీయే బెస్ట్'

సునీల్ గవాస్కర్, కృష్ణమాచారి శ్రీకాంత్ తదితర సీనియర్లు ధోనిని తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కెప్టెన్‌గా ధోనీ పని అయిపోయిందని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. పరిస్థితులు ఎదురు తిరిగినప్పుడు ధోనీకి ఏం చేయాలో తెలియడం లేదని, అతనిక టెస్టు కెప్టెన్‌గా పనికి రాడన్నారు. తానైతే అతన్ని ఇప్పుడు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గానే ఎంపిక చేస్తానన్నారు. కెప్టెన్సీ లేకుంటేనే ధోనీ జట్టుకు ఉపయోగపడతాడన్నారు.
టెస్టు జట్టు నుండి ధోనిని తప్పించి కోహ్లీకి అప్పగించాలని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. నాగపూర్ టెస్టు నాలుగో రోజుకు ముందు ధోనికి ప్రత్యామ్నాయం లేదని అన్నానని కానీ క్లిష్ట పరిస్థితుల మధ్య సెంచరీ చేసిన కోహ్లీ నేనున్నానని ముందుకొచ్చాడన్నారు. అతను కెప్టెన్సీ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడన్నారు. కెప్టెన్‌గా ధోని విఫలమయ్యాడన్నారు. సిరీస్‌లో ఇంగ్లాండు బ్యాట్స్‌మెన్ బాగా ఆడారని, మన బౌలర్లు, బ్యాట్స్‌మెన్ మాత్రం ప్రభావం చూపలేక పోయరన్నారు.
మరో మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ కూడా ధోనీని తప్పించి కోహ్లీకి టెస్టు పగ్గాలు అప్పగించాలని అభిప్రాయపడ్డారు. ధోని ఇంకా కెప్టెన్‌గా కొనసాగుతుండటం అదృష్టమే అన్నాడు. పటౌడీనో.. సునీల్ గవాస్కరో ఇన్ని టెస్టులు ఓడిపోయి ఉంటే ఇంతకాలం కొనసాగే వారు కాదన్నారు. ప్రపంచ కప్ విజయం తర్వాతనే ధోనీని తప్పించాల్సి ఉండెనన్నారు. ధోనీ చేసిన 99 పరుగుల ఇన్నింగ్స్ జట్టుకేమైనా ఉపయోగపడిందా అన్నారు. తానైతే కోహ్లీని కెప్టెన్‌గా చేస్తానని చెప్పారు. తెలివైన క్రికెటర్ అని బుర్ర ఉందన్నాడు. మరికొందరి నుండి కూడా కోహ్లీకి పగ్గాలు అప్పగించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications