జీవ వైవిధ్య సదస్సుకు హైదరాబాద్ రెడీ

జీవవైవిధ్య సదస్సు పేరుతో హైదరాబాద్‌ను మేకప్ చేస్తున్నారు. దానికి 350 కోట్లను కేటాయించారు. ప్రజా సమస్యలపై ఖర్చుపెట్టడానికి ఆ శాఖ ఈ శాఖ నుంచి క్లియరెన్స్ రాలేదంటూ.. నెలల తరబడి వాయిదాలు వేసే బిల్లులు... జీవవైవిధ్య సదస్సు పుణ్యమాని క్షణాల్లో క్లియరెన్స్ వచ్చేశాయి.
సదస్సు పనులను సకాలంలో పూర్తి చేయాలని వివిధ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మినీ మాథ్యూ విజ్ఞప్తి చేశారు. అయితే ఆమెకు గత కొద్దిరోజులుగా వివిధ ఫిర్యాదులు అందాయి. అయితే, జీవవైవిధ్య సదస్సు పేరుతో జరుగుతున్న కొన్ని కార్యాలు నివ్వెరపోయే విధంగా ఉన్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, శ్రీనగర్‌కాలనీ ఇలా ప్రముఖ ప్రాంతాలలో ఫ్లాట్‌ఫారమ్‌లు బాగు చేసే నెపంతో వాటిపై ఉన్న రాళ్ళను తొలగించి, మట్టిని తవ్వి, మళ్ళీ వాటినే పేర్చి సిమెంట్ రాస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి.
రోడ్డుపక్కల మొక్కలకు మట్టి, ఎరువులను వేసే క్రమంలో ఉన్నవాటిని తొలిచి, చుట్టూ ప్రహారీని కట్టడంలో అడ్డు వచ్చిన చెట్లను సైతం నరికేసి, ఆ స్థానంలో చిన్నపాటి మొక్కలను నాటడం చూసి మిన్నీ మాథ్యూస్ తన తనిఖీల సందర్భంగా చూసి నివ్వెరపోయారని మీడియా వార్తలు వస్తున్నాయి.
జీవ వైవిధ్య సదస్సు జరిగబోయే హెచ్‌ఐసీసీ వద్ద కొన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని మాథ్యూ హెచ్చరించారు. జాప్యానికి సబ్‌కాంట్రాక్టర్ కారణమని గుత్తేదార్ వాపోతున్నారు. అలాగే అంతర్జాతీయ ప్రతినిధులు పర్యటిస్తున్నారని భావిస్తున్న 125 కి.మీ. మార్గంలో దిక్సూచీ బోర్డులు ఏర్పాటు చేసే రెండు టెండర్లను అహ్మదాబాద్‌కు చెందిన ఒక కంపెనీ దక్కించుకుంది. ఇలా అన్ని పనుల్లోనూ కాంట్రాక్టర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications