'ధోనీ సహకరిస్తే లక్ష్మణ్ కథ మరోలా ఉండేది'

ధోనీతో ఫోన్‌లో మాట్లాడడం చాలా కష్టమని లక్ష్మణ్ మాటలపై గంగూలీ స్పందించారు. ప్రతీ కెప్టెన్ తన ఆటగాళ్లకు ఇరవై నాలుగు గంటలూ అందుబాటులో ఉండాలని కానీ, ధోనీ ఎందుకుండడో తనకర్థం కావడం లేదన్నారు. ధోనీ సహకారం ఉండి ఉంటే లక్ష్మణ్ కథ మరోలా ఉండేదని ఆవేదనగా చెప్పారు. రిటైర్మెంట్ ప్రకటించి లక్ష్మణ్ మంచి పని చేశాడన్నారు. దీనితో సెలెక్టర్లకు స్పష్టమైన మెసేజ్ పంపాడన్నారు. తాను ఇంకా ఆడుతున్నానని, లక్ష్మణ్‌కు ఐపిఎల్ ఛాన్స్ లేదని అందుకే తన కంటే లక్ష్మణ్ తీసుకున్న నిర్ణయమే కఠినమైనదని దాదా అన్నారు.
లక్ష్మణ్ పైన దిగ్గజ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపించారు. అస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా మాట్లాడుతూ.. రాహుల్ ద్రావిడ్‌ను ఔట్ చేస్తే గొప్ప అని, సచిన్ టెండుల్కర్‌ను ఔట్ చేస్తే సూపర్ అని, అదే వివిఎస్ లక్ష్మణ్‌ను ఔట్ చేస్తే మాత్రం అద్భుతమే అన్నారు. హైదరాబాదులో ఆడటానికి వస్తున్న తనకు వివిఎస్ లక్ష్మణ్ లేని లోటు పూడ్చలేనిదని మాస్టర్ బ్లాస్టర్ అన్నారు. లక్ష్మణ్ లాంటి క్రికెటర్ తరానికి ఒక్కరు మాత్రమే ఉంటారని, లక్ష్య ఛేదనలో ఆరి తేరాడని వెంగ్ సర్కార్ అన్నారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications