ద్రావిడ్ బ్యాడ్ లక్: గంగూలీ మాటేమిటి?

ద్రావిడ్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో గతంలో గ్రెగ్ చాపెల్ వల్ల ఇబ్బంది పడితే, ఇప్పుడు శ్రీశాంత్ వల్ల సమస్య ఎదుర్కున్నాడని గంగూలీ అన్నారు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై రాజస్థాన్ రాయల్స్ క్రీడాకారులు శ్రీశాంత్, అంకిత చవాన్, అజిత్ చండిల అరెస్టయిన మర్నాడు గంగూలీ ఓ టెలివిజన్ చానెల్‌తో మాట్లాడాడు.
రాహుల్ చూస్తే బాధేస్తోందని, ఇది అతని దురదృష్టమని ఆయన అన్నారు. రాహుల్ ద్రావిడ్ టీమిండియా కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఎక్కువ కాలం గ్రెగ్ చాపెల్ కోచ్‌గా ఉన్నాడు. అప్పుడు చాపెల్ వల్ల అతను ఇబ్బందులు పడ్డాడని, ఇప్పుడు శ్రీశాంత్ కారణంగా ఐపియల్‌లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా ద్రావిడ్‌ను దురదృష్టం వెంటాడిందని గంగూలీ అన్నాడు.
కాగా, రాహుల్ ద్రావిడ్‌పై గంగూలీ ప్రశంసలు కురిపించాడు. ఐపియల్ ఆరో ఎడిషన్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను రాహుల్ ద్రావిడ్ కెప్టెన్‌గా అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడని చెప్పారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు అంత గొప్పదేమీ కాదని, కెప్టెన్‌గా ద్రావిడ్ అద్భుతాలు చేశాడని, ద్రావిడ్ టెస్టుల్లో, వన్డేల్లో కెప్టెన్‌గా ఇంత బాగా వ్యవహరించిన సందర్భాలను తాను చూడలేదని గంగూలీి అన్నాడు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications