ఫొటోలు: కిరణ్ అప్పుడు సిగ్గరి, ఇప్పుడు ఇలా..
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పదవి చేపట్టిన కొత్తలో కొంత సిగ్గరిగా కనిపించేవారు. దానికితోడు, ఆత్మరక్షణలో ఉన్నట్లు కనిపించేవారు. మంత్రిగా పనిచేయకుండా ఏకంగా ముఖ్యమంత్రి అయినందుకు ఆయనపై కొన్ని వ్యాఖ్యలు కూడా వచ్చాయి. కాంగ్రెసులోనే ఉంటూ వైయస్ జగన్ తన వర్గం శాసనసభ్యులు ఎప్పటికప్పుడు ఆయనను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు.
జగన్ వర్గం బలంతో ప్రభుత్వం ఉంటుందా, ఊడుతుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతూ వచ్చాయి. తెలంగాణ అంశం ఆయనను ఎప్పటికప్పుడు ఇబ్బంది పెడుతూ వచ్చింది. ఆయన నిలదొక్కుకోవడానికి చాలా సమయమే తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా కె. రోశయ్య మాదిరిగానే ఆయన కూడా విఫలమవుతారనే మాట వినిపిస్తూ వచ్చింది.
అయితే, క్రమంగా ఆయన తన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తనవంటూ కొన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల ముందుకు వెళ్తున్నారు. సీమాంధ్రలోనే కాకుండా తెలంగాణలో కూడా ఆయన పర్యటిస్తున్నారు. ఈ స్థితిలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తున్నారు. శుక్రవారం ఆయన ఎపి డెయిరీ ప్రదర్శనలో పాల్గొని, వివిధ జాతులకు చెందిన ఆవులను, గేదెలను చూశారు. ఈ ప్రదర్శన హైటెక్స్‌లో ఏర్పాటైంది.

ఎపి డెయిరీ ప్రదర్శన - 2013లో శుక్రవారం రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.

ప్రదర్శనలో ముఖ్యమంత్రి ఇలా...

ప్రదర్సనలో గేదెను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి.

దూడను స్పర్శిస్తూ ఆనందంగా ముఖ్యమంత్రి...

ఆవును పరిశీలిస్తూ రైతుతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.

ఓ అవును చూస్తూ ముఖ్యమంత్రి ఇలా...

ఆవును ప్రదర్శనకు తెచ్చిన రైతుతో ముఖ్యమంత్రి...

ఇది ఏ జాతి ఆవో... ముఖ్యమంత్రి ఇలా...

ప్రదర్శనలో ముఖ్యమంత్రి ఇలా..

ప్రదర్శనలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిశీలన ఇలా..

రైతులతో కలిసిపోయి వారి ముచ్చటిస్తున్న ముఖ్యమంత్రి..












Click it and Unblock the Notifications