రేప్‌లు: రసాయన పుంస్త్వ నాశనం పనిచేస్తుందా?

రసాయన పుంస్త్వ నాశనం అంటే ఏమిటి?
కామ వాఛను, లైంగిక చర్యలను తగ్గించడానికి వైద్యం చేయడాన్నే రసాయన పుంస్త్వ నాశనంగా నిపుణులు చెబుతున్నారు. శస్త్రచికిత్స చేసి వృషణాలను లేదా అండాశయాలను తొలగించడం ద్వారా లైంగిక వంధ్యత్వాన్ని తేవడం సర్జికల్ కాస్ట్రేషన్. అయితే, అందుకు భిన్నంగా శరీరంలోకి మందులు ఎక్కించడం ద్వారా వంధ్యత్వానికి గురి చేయడం రసాయన పుంస్త్వ నాశనం. ఇది పూర్తిగా పుంస్త్వాన్ని నాశనం చేయదని, ఇది స్టెరిలైజేషన్ ప్రక్రియ కూడా కాదని అంటున్నారు.
చికిత్సను కొసాగించకపోతే రసాయన పుంస్త్వ నాశనం ప్రక్రియ తిరగబడుతుందని అంటున్నారు. అయితే, బాడీ కెమిస్ట్రీపై శాశ్వత ప్రభావం చూపుతుందని కూడా అంటున్నారు. మానవ హక్కుల కార్యకర్తలు అభ్యంతరాలు చెబుతున్నప్పటికీ, శరీరంపై సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అంటున్నప్పటికీ దాన్ని వాడకం అమలులో ఉంది.
కెమికల్ కాస్ట్రేషన్‌ను అమలు చేసే దేశాలు
ఈ ప్రక్రియ 1950 నుంచి అమలులో ఉఁది. అమెరికా దీన్ని అమలు చేస్తుంది. ఇజ్రాయెల్, అర్జెంటీనాలతో పాటు ఐరోపాలోని పలు దేశాలు దీన్ని అమలు చేస్తున్నాయి. కెమికల్ కాస్ట్రేషన్‌కు అనుకూలంగా రష్యా, దక్షిణ కొరియా 2011లో చట్టాలు చేశాయి. కెమికల్ కాస్ట్రేషన్‌ను మొదటిసారి 1944లో నిర్వహించారు. పురుషుల టెస్టోస్టిరోన్ స్థాయిని తగ్గించడానికి డీథైల్‌స్టిబెస్ట్రోల్ వాడారు.
ఇండియాలో కెమికల్ కాస్ట్రేషన్
భారతదేశంలో ఆత్యాచార నిరోధక చట్టం రూపకల్పనలో భాగంగా రేపిస్టులకు 30 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించడంతో పాటు కెమికల్ కాస్ట్రేషన్ అమలును సూచిస్తూ ముసాయిదాను సమర్పించారు. వైద్య విద్యార్థిని సామూహిక అత్యాచారం నేపథ్యంలో అత్యాచార నిరోధక చట్టాన్ని మరింత పటిష్టం చేసి, శిక్షను పెంచాలనే ఉద్దేశంలో భాగంగా ఆ సూచనలు వచ్చాయి. సంబంధిత మంత్రిత్వ శాఖ బిల్లును రూపొందించే పనిలో ఉంది. సూచనలను సమీక్షిస్తోంది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications