Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గోవా టూర్ ప్లాన్ చేస్తున్నారా?: టాప్ 5 హోటల్స్ ఇవే

పనాజీ: భారత దేశంలో ప్రముఖ టూరిస్ట్ ప్రదేశాల్లో గోవా ఒకటి. కేవలం భారతీయులనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించడం దీని ప్రత్యేకత. తక్కువ ఖర్చులో హాలీడేస్‌ స్పాట్‌ను ఎంజాయ్ చేయాలనుకునే పర్యాటకులకు జాబితాలో గోవా మొదటి స్థానంలో ఉంటుంది.

భారతదేశంలో పశ్చిమ తీరాన అరేబియా మహాసముద్రం అంచున గోవా ఉంది. ఈ ప్రాంతాన్ని కొంకణ తీరమని కూడా అంటారు. దేశంలో వైశాల్యపరంగా చూస్తే గోవా రెండో అతి చిన్న రాష్ట్రం. జనాభా పరంగా చూస్తే నాల్గవ అతి చిన్న రాష్ట్రం. ఈశాన్య రాష్ట్రాలైన సిక్కిం, మిజోరామ్, అరుమాచల్ ప్రదేశ్ కంటే గోవాలో జనసాంద్రత తక్కువ.

గోవా రాజదాని పనాజీ. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వర్తకులు గోవాలో స్థావరం ఏర్పరచుకున్నారు. వీరి కాలంలోనే గోవాలో ప్రత్యేకమైన కట్టడాలు, విశిష్టమైన వన సంపద రూపుదిద్దుకుంది. 1961లో భారత ప్రభుత్వం గోవాను తమ ఆధీనంలోకి తీసుకుంది.

5 Hotels In Goa You Can Book - when on a Luxury Vacation

భారతదేశంలోనే అంతమైన బీచ్‌లు కలిగి ఉన్న రాష్ట్రంగా గోవా ప్రసిద్ధి చెందింది. గోవా పర్యాటకులకు ఎంతో ఇష్టమైన ప్రదేశం. పర్యాటకులను ఆకట్టుకునేందుకు గోవా ప్రభుత్వం కూడా ఎన్నో ఆకర్షణీయమైన పథకాలను ప్రవేశపెట్టింది. ఇక్కడి బీచ్‌ల వల్ల గోవా మంచి పర్యాటక కేంద్రంగా ఎదిగింది.

గోవాను సందర్శించాలనుకనే పర్యాటకులకు అక్కడి స్థానికులు అనేక వసతులను కల్పిస్తున్నారు. ముఖ్యంగా అద్భుతమైన హోటల్స్ గోవా సొంతం. పర్యాటకులకు అద్భుతమైన అనుభూతిని అందించండలో ఇవి ఎంతగానో దోహదపడుతున్నాయి.

మీ తదుపరి హాలీడే‌ను గోవాలో జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం గోవాలో అత్యుత్తమ ఫైవ్ స్టార్ హోటల్స్ వివరాలు మీ కోసం ప్రత్యేకం:

1. Cidade De Goa (సిడాడె డీ గోవా)

గోవాను సందర్శించిన ప్రతి ఒక్కరూ సిడాడె డీ గోవా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. బీచ్‌కు ముఖంగా ఉన్న ఈ పైవ్ స్టార్ హోటల్‌ను 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ హోటల్‌లో పోర్చుగీసు వారి సంస్కృతి ప్రతిబింబిస్తుంది. స్థానిక గోవాకు చెందిన వంటలను అందిస్తుంది.

ముఖ్యంగా ఈ హోటల్‌లో రెస్టారెంట్స్ అందించే వెరైటీలు గోవాలోనే అరుదు. అప్పుడప్పుడు ఈ హోటల్‌లో పుడ్ ఫెస్టివల్స్‌ను కూడా నిర్వహిస్తుంటారు. పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ హోటల్‌లో స్పాతో పాటు మసాజ్ సెంటర్ కూడా ఉంది.

5 Hotels In Goa You Can Book - when on a Luxury Vacation

దీనికి తోడు రాత్రి పూట అద్భుతమైన మ్యూజిక్‌‌ను ప్లే చేస్తారు. అలా మ్యూజిక్‌ను ఆస్వాదిస్తూ హోటల్ లాన్‌లో కూర్చొని వైన్ తాగుతుంటే ఆ రుచి వేరు. పగలంతా గోవాలో ఆడిపాడిన పర్యాటకులు సాయంత్రానికి హోటల్‌లో సేదతీరే తీరు అద్భుతం.

2. Taj Exotica Goa (తాజ్ ఎక్సోటికా గోవా)

జీవితాన్ని కొన్ని రోజుల పాటు లగ్జరీగా గడపాలనుకునే వారు తాజ్ ఎక్సోటికా గోవా రూమ్ బుక్ చేసుకోవాల్సిందే. ఈ హోటల్ వైశాల్యం మొత్తం 56 ఎకరాలు. అద్భుతమైన సదుపాయాలతో పర్యాటకులకు విశేషంగా ఆకట్టుకుంటుంది.

ఇందులో స్విమ్మింగ్ పూల్‌ ఎంతో ప్రత్యేకం. ప్లవర్ షోని వీక్షించాలంటే రెండు కళ్లు చాలవు. జీవితంలో ఒక్కసారైనా గోవాకు వెళ్లాలనుకునే పర్యాటకులకు తాజ్ ఎక్సోటికా గోవా నిజంగా ఓ వరం. ఇందులో భారతీయత ఎక్కువగా ఉట్టిపడుతోంది.

5 Hotels In Goa You Can Book - when on a Luxury Vacation

సాధారణ డైనింగ్ రెస్టారెంట్స్‌తో పాటు అంతర్జాతీయ వంటకాలు మనల్ని నోరూరిస్తాయి. తాజ్ ఎక్సోటికా గోవా హోటల్ ఇంకో ప్రత్యేకత ఉంది. దీనికి అతి సమీపంలోనే బెనాలియం బీచ్ ఉంది. ఈ బీచ్‌లో వాటర్స్ స్పోర్ట్స్ ఎక్కువగా జరుగుతుంటాయి.

3. Novotel Goa Shrem Hotel (నోవాటెల్ గోవా షెరమ్ హోటల్)

పర్యాటకులు అత్యధిక రేటింగ్ (4.5/5) ఇచ్చిన హోటల్స్‌లో ఇదొకటి. సంవత్సరం మొత్తం పర్యాటకులతో బుక్ అయ్యే హోటల్స్‌లో నోవాటెల్ గోవా షెరమ్ అగ్రస్థానంలో ఉంటుంది. చూడగానే ఆకట్టుకునే భవంతులు ఈ హోటల్ సొంతం.

5 Hotels In Goa You Can Book - when on a Luxury Vacation

ప్రతిరోజూ యోగా, మెడిటేషన్ చేసుకునే వారికి ఈ హోటల్ ప్రత్యేకంగా సదుపాయాలను కల్పించారు. దీంతో పాటు హోటల్‌లో అద్భుతమైన డైనింగ్ రెస్టారెంట్స్, బార్ ప్రత్యేకం. గోవాకు వచ్చే పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకునే జోర్బింగ్ ఆట ఇక్కడ ప్రత్యేకం.

4. Grand Hyatt Goa (గ్రాండ్ హయత్ గోవా)

గ్రాండ్ హయత్ ఈ పేరులోనే ఓ రిథమ్ ఉంది. సెంట్రల్ గోవాలో ఉన్న ఈ గ్రాండ్ హయత్ హోటల్‌ బిజినెస్ పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తోంది. బాంబేలియం బేతో ఈ హోటల్‌లో రూపొందించిన సూట్స్, రూమ్‌లు పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తాయి.

5 Hotels In Goa You Can Book - when on a Luxury Vacation

గోవాలో అత్యుత్తమ హోటల్‌గా పేరు గాంచిన గ్రాండ్ హయత్‌కు 17వ సెంచరీ నుంచే పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంది. ఇండో-పోర్చుగీసు సంస్కృతి ఈ హోటల్‌లో ఉట్టి పడుతోంది. పర్యాటకులకు మర్యాదల విషయంలో కూడా ఏ మాత్రం తగ్గని హోటల్ సిబ్బంది ఇక్కడ ప్రత్యేకం.

5. Holiday Inn Resort Goa (హాలిడ్ ఇన్ రిసార్ట్ గోవా)

లగ్జరీని కోరుకునే వారి కోసమే ఈ హోటల్ పుట్టిందా అన్నట్లుగా ఉంటుంది హాలిడే ఇన్ రిసార్ట్ గోవా. దక్షిణ గోవాలో నిత్యం రద్దీగా ఉండే ప్రజల నుంచి పర్యాటకులను రక్షించి, సరికొత్త గోవాను చూపిస్తుంది. ఈ హోటల్‌కు అతి సమీపంలో ఉన్న బీచ్‌ ఎంతో ప్రశాంతగా ఉంటుంది.

5 Hotels In Goa You Can Book - when on a Luxury Vacation

దీనికి తోడు హోటల్‌లో ఉంటే పామ్ చెట్లు మనస్సుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఈ హోటల్‌లో రూమ్ బుక్ చేసుకున్న పర్యాటకుల కోసం లాన్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్, జోర్బింగ్ లాంటి కార్యకలాపాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇక చిన్న పిల్లల కోసం ఇక్కడో పెద్ద కిడ్స్ జోన్‌నే నిర్మించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+