నోట్ల రద్దుకు మద్దతు: రూ.1కే చీరల అమ్మకాలు, భారీగా మహిళలు

నల్లధనం, నకిలీ కరెన్సీని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రధాని మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని బీదర్‌లోని సృష్టి దృష్టి బట్టల దుకాణం యజమాని చంద్రశేఖర్ స్వాగతించారు.

బీదర్: నల్లధనం, నకిలీ కరెన్సీని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని కర్ణాటక బీదర్‌లోని సృష్టి దృష్టి బట్టల దుకాణం యజమాని చంద్రశేఖర్ పసార్గే స్వాగతించారు. అంతేగాక, మోడీ నిర్ణయానికి మద్దతు పలుకుతూ ప్రజలకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు.

అదేంటంటే.. నోట్ల రద్దును సమర్థిస్తూ రూపాయకే చీర అమ్మకాలు ప్రారంభించారు. ఈ వార్త దావానంలా అంతటా వ్యాపించడంతో మహిళలు పెద్ద ఎత్తున ఆ దుకాణం వద్దకు చేరుకుంటున్నారు. వందలాది మహిళలు రావడంతో ఆ వ్యాపారి పోలీసుల సాయం తీసుకోవాల్సి వచ్చింది.

A saree for a rupee to ‘celebrate demonetisation’

కాగా, ఇప్పటివరకూ మూడు వేలకు పైగా చీరలు అమ్మారు. ఒక్కో చీర ధర వంద ఉన్నా కేవలం ఒక్కరూపాయికే అమ్ముతున్నట్లు ఆయన తెలిపారు. లక్ష చీరలు అమ్మాలనేది తన లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ వ్యాపారి చెప్పారు.

రూపాయికే చీర కావడంతో మహిళలు పెద్ద ఎత్తున క్యూలో నిలబడి ఆ చీరలను కొనుగోలు చేస్తున్నారు. అంతేగాక, ఈ నిర్ణయం తీసుకున్న సదరు వ్యాపారిని అభినందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+