సిల్క్: నటి ప్రియాంక రావు 'సామి రంగా' (ఫొటోలు)
హైదరాబాద్: సిల్క్ దుస్తుల ప్రదర్శనలో నటి ప్రియాంక రావు మెరుపులు కురిపించింది. మహిళలు ధరించే దుస్తులు కొత్త రూపు సంతరించుకున్నాయి. సరికొత్త డిజైన్లలో అవి తయారవుతున్నాయి. హైదరాబాదులోని హిమాయత్ నగర్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) కళ్యాణమండపంలో పూర్వీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఆధ్వర్యంలో సిల్క్ ఆఫ్ ఇండియా వస్త్ర ప్రదర్శన ప్రారంభమైంది.
ఆ ప్రదర్శనను ఆదివారం సాయంత్రం నాసామి రంగ మూవీ ఫేమ్ నటి ప్రియాంకరావు ప్రారంభించారు. ఆ ప్రదర్శన సెప్టెంబర్ 29వ తేదీ వరకు పది రోజుల పాటు జరుగుతుంది. ఈ ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హ్యాండ్లూమ్ దుస్తులతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, కాశ్మీర్, కోల్‌కతాకు చెందిన దుస్తులను ప్రదర్శించారు.
ఆ దుస్తుల ప్రదర్సన గురించి పూర్వీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ నిర్వాహకుడు ఆశీష్ కుమార్ వివరించారు. ఈ ప్రదర్శన ఈ నెల 29వ తేదీ వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల ప్రజలకు ఉదయం పది గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

సరికొత్త డిజైన్లు
హైదరాబాదులోని సిల్క్ దుస్తుల ప్రదర్శనలో వివిధ డిజైన్ల ఉత్పత్తులను ప్రదర్శించారు. కంటికి నచ్చే డిజెన్లు ఇందులో ఉన్నాయి.

డిజైన్లను ఆసక్తికా తిలకిస్తున్నారు..
పూర్వీ అర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఏర్పాటు చేసిన సిల్క్ దుస్తుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ డిజైన్లను ఆసక్తిగా తిలకిస్తున్నారు. మహిళలను ఈ ప్రదర్శన ఆకట్టుకుంటోంది.

సిల్క్ చీరెలో మెరిసిన ప్రియాంకరావు
సిల్క్ దుస్తుల ప్రదర్శనను ప్రారంభించిన నటి ప్రియాంకరావు చీరెలో తన అందాలను ఒలకబోశారు. సిల్క్ చీరెలో ఆమె మెరిసిపోయారు.

ఒకే చోట ఇవన్నీ...
ప్రియాంకరావు స్టాల్స్‌ను సందర్శించి కొత్త డిజైన్లను తిలకించారు. ఆ తర్వాత ఆమె మాట్లాడారు. ఇలాంటి ప్రదర్శనల ద్వారా అన్ని రకాల ఉత్పత్తులు ఒకే చోట దొరుకుతాయని ఆమె అన్నారు.

ప్రదర్శిస్తున్న ప్రియాంక రావు
ప్రదర్శనలోని సిల్క్ దుస్తుల ఉత్పత్తులను ప్రియాంక రావు ఇలా చూపిస్తూ కనిపించారు. ఆమె చీరెల అందాలను చూపించారు.

ఒంటిపై మెరిసిన చీర
నటి ప్రియాంక రావు తన ఒంటిపై కప్పుకుని చీరెల అందాలను ప్రదర్శించారు. ప్రదర్శనలోని స్టాల్స్‌ను ఆమె సందర్శించారు.

డ్రెస్ మెటిరీయల్..
మహిళలకు నచ్చే చేనేత వస్త్రాలతో పాటు యువతులకు అవసరమయ్యే డ్రెస్ మెటిరీయల్స్, జ్యుయల్లరీ ఉత్పత్తులను ఏర్పాటు చేసినట్లు ఆశీష్ కుమార్ చెప్పారు.

యువతకు ఆకర్షణ
ప్రదర్శన యువతులను విశేషంగా ఆకట్టుకుంటోంది. స్టాల్స్‌లో యువతులు ఇలా వివిధ ఉత్పత్తులను సందర్శిస్తూ కనిపించారు.












Click it and Unblock the Notifications