చారిటీ కార్యక్రమంలో మెరిసిన నటి సమంత(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలో 10కె రన్‌కు నిధులు సమీకరించిన దాతలు, సంస్థలకు చారిటీ పార్ట్‌నర్‌గా వ్యవహరించిన యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ అవార్డులు బహూకరించింది. శుక్రవారం రాత్రి గోల్కొండ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ సినీ నటి సమంత ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ..‘ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహించడమంటే మాటలు కాదని అన్నారు. నిధుల సేకరణ దగ్గర నుంచి అర్హులను గుర్తించి అవసరమైన సహాయం చేయడం వరకూ ఎన్నో సమస్యలుంటాయని చెప్పారు. ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలిగా అనుభవం మీద తెలుసుకున్న నిజమని సమంత అన్నారు.
తాను ప్రత్యూష పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నానని సమంత చెబుతూ చిన్నారులకు అవసరమైన ఇంటెన్సివ్ కేర్ వైద్య సేవలను ఈ ఫౌండేషన్ అందిస్తోందన్నారు. యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ ప్రతినిధి రమేష్ కాజా మాట్లాడుతూ.. ఇప్పుడు సమీకరించిన నిధులను 62 స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ ఛైర్మన్ శక్తిసాగర్ తదితరులు పాల్గొన్నారు.

సమంత
నగరంలో 10కె రన్‌కు నిధులు సమీకరించిన దాతలు, సంస్థలకు చారిటీ పార్ట్‌నర్‌గా వ్యవహరించిన యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ అవార్డులు బహూకరించింది.

సమంత
శుక్రవారం రాత్రి గోల్కొండ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ సినీ నటి సమంత ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.

సమంత
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ..‘ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహించడమంటే మాటలు కాదని అన్నారు.

సమంత
నిధుల సేకరణ దగ్గర నుంచి అర్హులను గుర్తించి అవసరమైన సహాయం చేయడం వరకూ ఎన్నో సమస్యలుంటాయని చెప్పారు.

సమంత
ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలిగా అనుభవం మీద తెలుసుకున్ననిజమని సమంత అన్నారు.

సమంత
తాను ప్రత్యూష పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నానని సమంత చెబుతూ చిన్నారులకు అవసరమైన ఇంటెన్సివ్ కేర్ వైద్య సేవలను ఈ ఫౌండేషన్ అందిస్తోందన్నారు.

సమంత
యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ ప్రతినిధి రమేష్ కాజా మాట్లాడుతూ.. ఇప్పుడు సమీకరించిన నిధులను 62 స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ ఛైర్మన్ శక్తిసాగర్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications