Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వావ్! సూపర్బ్: స్విమ్మింగ్‌ఫూల్‌లో దాండియా(పిక్చర్స్)

హైదరాబాద్: దాండియా సందడి నగరంలో ఊపందుకుంది. అచంచలమైన భక్తి... ఉత్సాహపరిచే సంగీతం.. తనువుమరిచి మరీ ఆడే నృత్యాలతో అందరూ ఘనంగా నవరాత్రి వేడుకలను జరుపుకుంటున్నారు.

బంజారాహిల్స్‌లోని 'వాటర్స్'లో ఆదివారం నిర్వహించిన ఆక్వా గర్బా దాండియా సందడిగా సాగింది. మహిళలు నీటి కొలనులో ఆడిపాడుతూ ఆనందంగా గడిపారు. ఫిట్నెస్ ట్రైనర్ వేణు మందల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా సాగింది.

అభిమంకియా, వేణు, నాన్సీ జోసెఫ్

అభిమంకియా, వేణు, నాన్సీ జోసెఫ్

బంజారాహిల్స్‌లోని ఓ లాంజ్ వద్ద ఏర్పాటు చేసిన ఈ ఆక్వా దాండియాలో మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

కొలనులో గార్బా-దాండియా

కొలనులో గార్బా-దాండియా

జుంబా ఫిట్నెస్ ఇన్‌స్ట్రక్టర్ వేణు మండల నిర్వహించిన ఈ ఆక్వా దాండియాలో 40మందికి పైగా సోషలైట్లు పాల్గొన్నారు.

స్విమ్మింగ్ ఫూల్‌లోనే...

స్విమ్మింగ్ ఫూల్‌లోనే...

ప్రతి సంవత్సరం దాండియా, గార్భా వేడుకలలో వైవిద్యత చూపాలని కోరుకుంటామని, ఈ ఆక్వా దాండియా చేయడం రెండోసారని ఈ సందర్భంగా వేణు మండల చెప్పారు.

 ఉత్సాహంగా..

ఉత్సాహంగా..

ఫంక్షన్‌ హాళ్లు.. రిసార్టుల్లో ప్రత్యేక ఏర్పాట్లు గురించే విన్న నగరవాసులు ఈ దాండియా ఆడటంలో కూడా ట్రెండ్‌‌సను అనుసరించేయటానికి ఉబలాటపడుతున్నారు.

ఉల్లాసంగా

ఉల్లాసంగా

ఆయా క్లబ్‌లు ఈ సారి నగరంలో దాండియా వేడుకలను వినూత్న నేపథ్యాలతో నిర్వహిస్తుంటే, పండుగ దగ్గర పడే కొద్దీ ఈ దాండియాని మరింత ఉల్లాసంగా జరుపుకోమంటూ సెలబ్రిటీలని దింపి మరీ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈవెంట్ల నిర్వాహకులు.

 దాండియా

దాండియా

రాస్‌లే దాదాండియా రాస్‌ అనేది భారత దేశంలోని బృందావనంకి సంబంధించిన సంప్ర దాయ జానపద నృత్యం, అక్కడ దీన్ని హోలీ దృశ్యాలను, రాధాకృ ష్ణుల లీలా దృశ్యాలను వివరిస్తూ ప్రదర్శిస్తారు. నవరాత్రులలో పశ్చిమ భారత దేశంలో సాయంకాలం వేళల్లో గర్బా నృత్యంతో పాటు ఇది కూడా ఒక ముఖ్య నృత్యంగా ప్రదర్శించడం జరుగుతుంది.

నీటిలో నృత్యాలు

నీటిలో నృత్యాలు

రాస్‌ అను పదం సంస్కృతంలోని రస్‌ అనే పదం నుంచి వచ్చింది. రాస్‌ యొక్క మూలాలు ప్రాచీన కాలానికి చెందినవిగా గుర్తించవచ్చు. కృష్ణ్ణ భగవానుడు రాస లీల ప్రదర్శించాడు.

సందడిగా సాగింది

సందడిగా సాగింది

రాస్‌ యొక్క రూపాలు అనేకం, కానీ గుజరాత్‌లో నవరాత్రులలో ప్రదర్శించే దాండియా రాస్‌ అత్యంత జనప్రియమైన రూపం. రాస్‌ యొక్క ఇతర రూపాలలో ఒకే ఒక పెద్ద కర్ర ఉపయోగించి రాజస్తాన్‌లో చేసే దంగ్‌ లీల మరియు దక్షిణ భారతంలో చేసే రాస లీల ఉన్నాయి. రాస్‌ లీల మరియు దాండియా ఒక దానిని ఒకటి పోలి ఉంటాయి. కొందరు అయితే గర్బాను రాస్‌లో ఒక రూపంగా భావించి రాస్‌ గర్బా అని అంటారు.

దాండియా రాస్

దాండియా రాస్

దాండియా రాస్‌లో పురుషులు మరియు స్త్రీలు చేతిలో కరల్రు పట్టుకుని రెండు వలయాలలో నాట్యం చెయ్యడం చేస్తారు. ప్రాచీన కాలంలో అయితే రాస్‌లో పాటలు పాడటం అంటూ పెద్దగా ఉండేది కాదు, కేవలం డోలు దరువులే సరిపోయేవి.

దాండియా అంటే

దాండియా అంటే

దాండియా అనగా సుమారు 18 పొడుగు ఉన్న కరల్రు. ప్రతి నర్తకి లేదా నర్తకుడు రెండు కరల్రు పట్టుకున్నప్పటికీ, అప్పుడప్పుడూ దాండియాలు తక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఒకే ఒక్క దాన్ని కుడి చేతిలో ఉపయోగి స్తారు. సాధారణంగా, ఒక నాలుగు దరువుల తాళా నికి ఎదురెదురుగా నర్తించే వారు ఒకే సమయానికి తమ కరల్రను ధ్వని వెలువడేలా అవతలివారి కరల్రకు తాకించ డంతో విన సొంపు అయిన ధ్వని సృష్టించబడు తుంది. ఒక వలయం గడియా రపు ముళ్ళు తిరిగే దిశలో ముందుకు సాగితే మరొకటి దానికి వ్యతి రేక దిశలో ముందుకు సాగడం చేస్తుంది. పశ్చి మంలో, నర్తించే వారు పూర్తి వల యాలను ఏర్పర చరు, అందుకు మారుగా తరచూ పంక్తులు ఏర్పరచడం చేస్తారు.

దాండియా రాస్‌ పుట్టుక

దాండియా రాస్‌ పుట్టుక

భక్తి సంబంధిత గర్బా నృత్యాలుగా ఆరంభమై, ఎల్లవేళలా దుర్గాదేవి గౌరవార్ధం ప్రదర్శించబడే నృత్యాలలో ఒకటి అయిన ఈ నృత్య రూపం వాస్తవానికి దుర్గాదేవికీ, పరాక్రమవంతుడైన దానవరాజు మహిషాసురునికీ మధ్య జరిగిన పోరాటం యొక్క ప్రదర్శన, ఇది ఖడ్గ నృత్యం అని కూడా పిలవబడు తుంది. నృత్య సమయంలో, రూపకల్పన చేసిన విధంగా నాట్యకారులు చేతులు మరియు పాదాలు సంగీతానికి అనుగుణంగా కష్టమైన రీతిలో అనేక విధాలుగా లయబద్ధంగా కదుపుతూ అత్యంత శక్తితో తిరగడం చేస్తారు. డోలుతో పాటు ధోలక్‌, తబలా మరియు ఇతర శబ్ద వాయిద్యాలు కూడా ఉపయోగించడం జరుగుతుంది.
నృత్యంలోని కరల్రు (దాండియాలు) దుర్గాదేవి ఖడ్గంకి సూచనగా నిలుస్తాయి. స్త్రీలు ఎంబ్రాయిడరీ చేసిన, అద్దాల పనితనంతో తళుక్కుమనే సాంప్రదాయ దుస్తులు, అంటే రంగు-రంగుల జాకెట్టు, పరికిణీ మరియు బంధాని దుపట్టా వంటివి ధరించి బరువైన నగలు కూడా ధరిస్తారు. పురుషులు ప్రత్యేకమైన తలపాగాలు మరియు కేడియాలు ధరిస్తారు, అయితే, ఇవి ప్రాంతానుగుణంగా మారుతూ ఉంటాయి.

భక్తి ప్రదర్శన

భక్తి ప్రదర్శన

దుర్గాదేవి గౌరవార్ధం హారతి (భగవతారాధనలో ఒక ఆచారం)కి ముందు భక్తి సంబంధిత ప్రదర్శనలలో ఒక దానిగా గర్బా నృత్యం ప్రదర్శిస్తే, దాండియాను వినోదంలోని భాగంగా ఆ తర్వాత ప్రదర్శించడం జరుగుతుంది. రాస్‌ దాండియా మరియు గర్బాలో పురుషులు మరియు స్త్రీలు జతగా చేరడం జరుగుతుంది. దాండియా రాస్‌ లోని వలయాకార కదలికలు గర్బాలోని వాటికంటే అతి సంక్లిష్టమైనవి. రాస్‌ లేక ఈ నృత్య ప్రదర్శనలకు మూలం కృష్ణుడు. నేడు, రాస్‌ గుజరాత్‌లో నవరాత్రులలో ఒక ముఖ్య భాగం మాత్రమే కాదు, పైరులకు, పంటకోతలకూ సంబంధించిన అనేక పండుగలకు కూడా విస్తరించ బడింది. సౌరాష్టల్రోని మెర్‌ అను తెగవారు రాస్‌ నృత్యాన్ని అత్యంత బలం మరియు సత్తువలతో ప్రదర్శిస్తారని ప్రతీతి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+