కిషన్, రమణ బతుకమ్మ: కాలేజీలో గర్ల్స్ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. అంబర్ పేటలో బిజెపి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరిగాయి. ఈ వేడుకల్లో బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు.
మరోవైపు, సద్దుల బతుకమ్మ వేడుకలకు వివిధ ప్రభుత్వ శాఖలు భారీగా ఏర్పాట్లు చేశాయి. తొమ్మిదిరోజుల పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఎంతో భక్తిశ్రద్దలతో ఘనంగా జరిగే ఈ బతుకమ్మ చివరి రోజు ఆటాపాటకు హుస్సేన్ సాగర్ సర్వాంగసుందరంగా ముస్తాబైంది.
ఇందుకు మహానగర పాలక సంస్థ తరపున రూ. 2.5 కోట్లతో భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే బతుకమ్మ పండుగ ప్రాశస్త్యాన్ని, చారిత్రక నేపథ్యాన్ని ప్రజలకు తెలిసేలా వివిధ ప్రాంతాల్లో 545 హోర్డింగ్‌లను ఏర్పాటు చేసిన మహానగర పాలక సంస్థ చివరి రోజు ఉత్సవ ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.

బతుకమ్మ
ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీ చవరి రోజున ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు జరిగే బతుకమ్మ శోభయాత్ర రూట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ సోమేశ్ కుమార్ తెలిపారు.

బతుకమ్మ
పారిశుద్ధ్యం కోసం సుమారు 160మంది కార్మికులను ప్రత్యేకంగా నియమించినట్లు వెల్లడించారు. 95 మంది శానిటేషన్ ఫీల్డు అసిస్టెంట్లతో కూడిన బతుకమ్మ యాక్షన్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బృందాలు స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించనున్నట్లు తెలిపారు.

బతుకమ్మ
నగరంలోని పదివేల మంది స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలు ఆ రోజున బతుకమ్మతో ఉత్సవాల్లో పాల్గొనున్నట్లు వివరించారు. రూట్ పొడువున మహిళల భద్రత, సౌకర్యం కోసం సుమారు 23,500 వీది ధీపాలను అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

బతుకమ్మ
దీనికి తోడు నగరంలోని ప్రధాన కూడళ్లలో ఇప్పటికే వంద వరకు భారీ బతుకమ్మలను పేర్చి ఉంచినట్లు ఆయన తెలిపారు.

బతుకమ్మ
ట్యాంక్‌బండ్‌తో పాటు సరూర్‌నగర్, ఐడిఎల్, హస్మత్‌పేట, ప్రగతినగర్, సున్నం చెరువు, గంగారం చెరువు, దుర్గం చెరువు, పల్లె చెరువు, పెద్ద చెరువులతో పాటు అనేక చెరువులు, కుంటల వద్ధ ప్రధాన దేవాలయాల వద్ధ సద్దుల బతుకమ్మ పండుగకు, నిమజ్జనానికి జిహెచ్‌ఎంసి భారీ ఏర్పాట్లు చేసింది.

బతుకమ్మ
తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. స్టెయిన్లీ కళశాలలో బతుకమ్మ సంబరాలు జరిగాయి.

కిషన్ రెడ్డి
అంబర్ పేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ సంబరం.

కిషన్ రెడ్డి
అంబర్ పేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బతుకమ్మను ఎత్తుకున్న కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి
అంబర్ పేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు.

కిషన్ రెడ్డి
అంబర్ పేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ డోలు వాయింపు.

రవీంద్ర భారతిలో బతకుమ్మ
రవీంద్ర భారతిలో డిపార్టుమెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకలు.

ఎన్టీఆర్ ట్రస్టు భవన్
తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. పాల్గొన్న తెలంగాణ నేతలు.

ఎన్టీఆర్ ట్రస్టు భవన్
తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. పాల్గొన్న తెలంగాణ నేతలు.

ఎన్టీఆర్ ట్రస్టు భవన్
తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. పలువురు తెలంగాణ నేతలు పాల్గొన్నారు. బతుకమ్మను ఎత్తుకున్న ఎర్రబెల్లి

ఎన్టీఆర్ ట్రస్టు భవన్
తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. పాల్గొన్న తెలంగాణ నేతలు.












Click it and Unblock the Notifications