హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పిన్న వయస్కుడిగా చరిత్ర: అవయవదానంతో హీరో

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బ్రటిన్‌లో అవయవదానం చేసిన అతని పిన్న వయస్కుడిగా టెడ్డీ చరిత్రలో నిలిచిపోయాడు. తమ కుమారుడి కిడ్నీలు మరో శిశువుకి దానం చేయాలని నిర్ణయం తీసుకున్న తల్లిదండ్రులు ప్రపంచ వ్యప్తంగా పలువురి అందుకున్నారు. ఈ సంఘటన బ్రిటన్‌లోని కార్ఢిఫ్ నగరంలో చోటు చేసుకుంది.

కవల పిల్లలు పుట్టబోతున్నారన్న వార్త 12 నెలల గర్భవతి జెస్ ఇవాన్స్, మైక్ హాల్‌స్టన్‌లకు ఎంతో కాలం నిలవలేదు. పుట్టబోయే శిశువుల్లో ఒకరికి మెదడులో తలెత్తిన సమస్యలతో బతికే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు. దీంతో తమ శిశువు జన్మకు సార్ధకత చేకూర్చాలని, మరొకరికి ప్రాణం పోయడానికి అవయవదానం చేయడానికి టెడ్డీ తల్లిదండ్రులు ముందుకొచ్చారు.

Britain's youngest organ donor saved a stranger's life just moments after being born

జెస్ ఇవాన్స్, మైక్ హాల్‌స్టన్‌ దంపతులకు సరిగ్గా ఏడాది క్రితం టెడ్డీ, నోహా హూలస్టన్ అనే ఇద్దరు కవలలు జన్మించారు. టెడ్డీ అనే శిశువు పుట్టిన 100 నిమిషాల వ్యవధిలోనే మరణించడంతో బాలుడి కిడ్నీలు, హార్ట్ వాల్వ్స్ తొలగించారు. టెడ్డీ అవయవాలను 233 కిలోమీటర్లు దూరంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మరో శిశువుకి అమర్చారు.

టెడ్డీ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయానికి బ్రిటన్‌లో వారిపై ప్రశంసలు కురిపించారు. డైలీ మిర్రర్ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో టెడ్డీ తండ్రి మాట్లాడుతూ తమ కుమారుడు హీరోగా పుట్టి, హీరోగానే చనిపోయాడని, అందుకు తాము ఎంతో గర్విస్తున్నామని అన్నారు.

ఎవరైతే తల్లిదండ్రులు తమ పిల్లలను కోల్పోయారో అలాంటి కుటుంబాలకు టెడ్డీ స్టోరీ ఒక ప్రేరణగా నిలుస్తోందని అన్నారు. టెడ్డీ చేసిన అవయవదానం ఎంతో మందికి స్పూర్తిదాయకంగా ఉందని, ఇదొక గొప్ప హీరోయిజంతో కూడిన నిస్వార్థ చర్యగా అభివర్ణించారు.

English summary
The parents of Britain's youngest organ donor have told how they made the brave but heartbreaking decision to donate their son's kidneys when he died after living for just 100 minutes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X