కోచ్ ఎంపికలో ట్విస్ట్, కుంబ్లే కంపెనీలో లక్ష్మణ్‌కు షేర్లు
ముంబై: టీమిండియా హెడ్ కోచ్‌గా అనిల్ కుంబ్లే ఎంపిక పైన కొత్త కోణం వెలుగు చూసింది! హెడ్ కోచ్ రేసులో రవిశాస్త్రి కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, సెలక్టర్లు కుంబ్లే వైపు మొగ్గు చూపారు. తనను ఎంపిక చేసుకోకపోవడంపై రవిశాస్త్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై గంగూలీ-శాస్త్రి మధ్య వాగ్యుద్ధం సాగింది.
కోచ్‌గా కుంబ్లేను ఎంపిక చేసిన కమిటీలో సచిన్ టెండుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ తదితరులు ఉన్నారు. ఈ కమిటీ సూచన మేరకే కుంబ్లే ఎంపికయ్యారు. కుంబ్లే ఎంపిక.. 'పరస్పర ప్రయోజన' కోణం కనిపిస్తున్నట్లుగా ఉందని ఆంగ్ల మీడియాలో వార్తలు వచ్చాయి.

కుంబ్లే క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన తర్వాత, 2011లో టెన్విక్ స్పోర్ట్స్ పేరిట ఓ కంపెనీని పెట్టాడు. టెన్నిస్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణే, టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు శరత్ కమల్‌లు కూడా కుంబ్లే కంపెనీలో షేర్ హోల్డర్లు.
ఈ కంపెనీతో వీవీఎస్ లక్ష్మణ్ 2012లో 16,666 ఈక్విటీ షేర్లను కొన్నాడు. ఆ షేర్లు ఈ ఏడాది ప్రారంభం నాటికి రెట్టింపయ్యాయి. ప్రస్తుతం టెన్వీ స్పోర్ట్స్‌లో లక్ష్మణ్‌కు 33,332 షేర్లు ఉన్నాయి. తాను పెట్టుబడి పెట్టిన కంపెనీ అధినేతగా ఉన్నందునే లక్ష్మణ్ కోచ్ పదవికి... కుంబ్లేను ఎంపిక చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో కుంబ్లే కంపెనీలో లక్ష్మణ్‌కు వాటాలున్న సంగతి సచిన్, గంగూలీలకు తెలుసో లేదో తెలియదని చెబుతున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications