దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
 • search

నమ్మలేని నిజాలు?: ప్రపంచానికి తెలియని 'ఉ.కొరియా' ఇది.., అంతా ఆశ్చర్యమే!

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ప్యోంగ్‌యాంగ్: సోషలిస్టు దేశమైన ఉత్తరకొరియాలో నియంత తరహా పాలన చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఇందులో నిజానిజాలను ప్రత్యక్షంగా చూసినవాళ్లెవరు? అన్న ప్రశ్న కూడా ఉంది.

  అంతర్జాతీయ సమాజంలో మాత్రం ఉత్తరకొరియా 'ఇన్‌సైడ్'పై మంచి కన్నా చెడు విషయాలే ఎక్కువ ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా అక్కడి పాలనలో ప్రజలు బానిసల్లా బతుకీడుస్తున్నారనే వాదన ఉన్నది. ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ నియంత్రుత్వ పోకడలు దేశంలో దారిద్య్రాన్ని అంతకంతకూ పెంచుతున్నాయన్న విమర్శ ఉంది.

  ఉత్తరకొరియాలో ఆకలి చావులు, మానవ హక్కుల ఉల్లంఘన అనేవి అత్యంత సహజంగా మారిపోయిన పరిస్థితి ఉందని కూడా అంటారు. అంతర్జాతీయ సమాజంలో ఉత్తరకొరియాపై వాడి వేడి చర్చ జరుగుతున్నవేళ.. ఆ దేశానికి సంబంధించిన అంతర్గత విషయాలు, అక్కడి ప్రజల నమ్మకాల గురించి తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు.

  ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా గురించి ప్రచారంలో ఉన్న మరికొన్ని విషయాలను ఇక్కడ అందిస్తున్నాం.

  జీవితంలో 'టాయిలెట్' వెళ్లలేదట:

  జీవితంలో 'టాయిలెట్' వెళ్లలేదట:

  ఉత్తరకొరియా అధ్యక్షుడిని అక్కడి ప్రజలు దైవ సమానంగా భావిస్తారు. ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సహా అంతకుముందు అధ్యక్షులుగా ఉన్న అతని తండ్రి, తాతలు కిమ్ జాంగ్ ఇల్, కిమ్ Il-సంగ్ లపై వారికి అదే రకమైన భావన ఉంటుంది. అయితే వీరి వ్యక్తిగత విషయాలకు సంబంధించి కొన్ని అమూర్త భావనలను ఆపాదించినట్టు కనిపిస్తుంది.

  కిమ్ జాంగ్ ఇల్, కిమ్ Il-సంగ్ లు వారి జీవిత కాలంలో అసలు మల, మూత్ర విసర్జనే చేయలేదన్న ప్రచారం ఉత్తరకొరియాలో ఉంది. ఒకరకంగా వీరిని వారు మానవ అతీతులుగా భావించారని కూడా చెబుతారు. అందువల్లే వారికి టాయిలెట్ అవసరం రాలేదని అంటారు.

  ఇక ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ జాంగ్-ఉన్ ఎక్కడికెళ్లినా.. ఆయనకో ప్రత్యేక టాయిలెట్ ఉంటుందట. అది కేవలం కిమ్ మాత్రమే ఉపయోగిస్తారని చెబుతారు. కారులో ప్రయాణించినా.. రైల్లో ప్రయాణించినా.. అతని కోసం కచ్చితంగా ప్రత్యేక టాయిలెట్ ఏర్పాటు చేస్తారట.

  భయంకరమైన నిజాలు: భూతల నరకం ఉ.కొరియా, ప్రపంచానికి తెలియని అక్కడి బతుకు?

   మూడేళ్లకే డ్రైవింగ్:

  మూడేళ్లకే డ్రైవింగ్:

  ఉత్తరకొరియాలోని పాఠశాలల్లో కేవలం ఆ దేశ చరిత్ర మాత్రమే బోధిస్తారు. అందులోను కిమ్ జాంగ్ కుటుంబ చరిత్రే ప్రధానంగా ఉంటుందని చెబుతారు. 2015లో వెలువడ్డ కొన్ని నివేదికలు ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాయి. కిమ్ జాంగ్-ఉన్ పుట్టుకతోనే కొన్ని అసాధారణ లక్షణాలతో జన్మించాడని, మూడేళ్ల వయసులోనే డ్రైవింగ్ నేర్చుకున్నాడని, తొమ్మిదేళ్లకే యాచింగ్ రేసులు(సెయిలింగ్ బోట్స్) గెలిచాడనేది దాని సారాంశం. ఈ అంశాలన్నింటిని అక్కడి పాఠ్య పుస్తకాల్లో చేర్చారన్న ప్రచారం కూడా ఉంది.

  ఉ.కొరియా వెనుక ఆ దేశం: అమెరికాకు ఊహించని షాక్?, ద్వంద్య నీతికి పరాకాష్ఠ!

   డబుల్ రెయిన్ బో:

  డబుల్ రెయిన్ బో:

  ఉత్తరకొరియా ఒకప్పటి అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఇల్ పుట్టుక సమయంలో కొన్ని అద్భుతాలు చోటు చేసుకున్నాయని చెబుతారు. కిమ్ జాంగ్ ఇల్ అధికారిక బయోగ్రఫీలో ఈ విషయాలను వెల్లడించారు.

  ఆ డాక్యుమెంట్ కథనం ప్రకారం.. మిలటరీ బేస్ పరిధిలో ఉన్న ఓ పవిత్ర పర్వతంపై కిమ్ జాంగ్ ఇల్ జన్మించారు. అతను జన్మించిన కొద్దిసేపటికే ఆకాశంలో డబుల్ రెయిన్ బో(ఇంద్రధనుస్సు) ఏర్పడిందని కూడా అందులో పేర్కొన్నారు.

  మరోవైపు సోవియెట్ రష్యా డాక్యుమెంట్లలో మాత్రం దీనిపై మరో విధమైన సమాచారం ఉంది. వ్యోట్ స్కోయ్ అనే ప్రాంతంలో కిమ్ జాంగ్ ఇల్ జన్మించారని, అక్కడ తన తండ్రి ఆధ్వర్యంలో నడిచే మిలటరీ బెటాలియన్ ఉండేదని అందులో పేర్కొన్నారు.

  8 నిజాలు: కిమ్ గురించి ప్రపంచానికి తెలియనవి, అదొక మిస్టరీ, దానికి డై-హార్డ్ ఫ్యాన్?

   కిమ్ జాంగ్ ఇల్-1500పుస్తకాలు:

  కిమ్ జాంగ్ ఇల్-1500పుస్తకాలు:

  అకడమిక్ పరంగా కిమ్ జాంగ్ ఇల్ అత్యంత జీనియస్ అని చెబుతారు. ఆయన బయోగ్రఫీ ప్రకారం.. యూనివర్సిటీలో ఉన్న సమయంలో దాదాపు 1500 పైచిలుకు పుస్తకాలు రాశారాయన. ఇవన్నీ స్టేట్ లైబ్రరీలో ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయని చెబుతారు. స్వయంగా ఆరు ఒపెరాలు(సంగీతానికి సంబంధించిన క్లాసికల్ ఆర్ట్ ఫామ్) కూడా రాసినట్టు చెబుతారు. ఈ ఆరు ఒపెరాలు సంగీత ప్రపంచంలోనే అత్యుత్తమమైనవని అంటారు.

   క్యాన్సర్, ఎయిడ్స్‌లకు నివారణ;

  క్యాన్సర్, ఎయిడ్స్‌లకు నివారణ;

  ఎయిడ్స్, ఎబోలా, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను పూర్తిగా నయం చేసే చికిత్స ఉత్తరకొరియాలో మాత్రమే అందుబాటులో ఉందని చెబుతారు. ఇక్కడి సైంటిస్టులు తయారుచేసిన ఒకరకమైన మిరాకిల్ డ్రగ్ ద్వారా ఈ వ్యాధులను నయం చేస్తారని తెలుస్తోంది. భూమిలోని అరుదైన ధాతువుల నుంచి ఈ డ్రగ్ తయారుచేసినట్టు చెబుతారు. అయితే దురదృష్టవశాత్తు ఈ మెడిసిన్‌ను ప్రపంచదేశాలతో షేర్ చేసుకోవడానికి ఉత్తరకొరియా ఒప్పుకోలేదు.

  ద.కొరియాలో మాత్రమే కనిపించే కల్చర్స్: టాప్-5 షాకింగ్ విషయాలు..

  English summary
  The North Korean government is as fascinating as it is alarming. The country describes itself as a socialist state, but critics note its stark parallels to a dictatorship - particularly the rule of leaders Kim Jong-il and Kim Jong-un. If you read the crazy things North Korean leaders have said, you'll probably want to learn more about the country.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more