చరిత్ర: నంద్యాల చర్చికి మహిళా బిషప్
హైదరాబాద్: సుప్రసిద్ధ దక్షిణ భారత దేశ చర్చి తొలిసారి ఒక మహిళను బిషప్‌గా నియమించడం ద్వారా చరిత్ర సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల చర్చి బిషప్‌గా రెవరెండ్ ఎగ్గోని పుష్పలలితను చర్చి సైనోడ్ కార్యనిర్వాహక కార్యదర్శి గురువారం నియమించారు. పుష్పలలిత భారతదేశంలో చర్చి బిషప్‌గా బాధ్యతలు చేపట్టిన రెండో మహిళగా రికార్డుల్లోకెక్కారు.
ఐర్లాండ్ చర్చి బిషప్‌గా ఒక మహిళ రెవరెండ్ ప్యాట్రిక్ స్టోరేను నియమించిన తర్వాత రోజే పుష్పలలితను నంద్యాల చర్చి బిషప్ నియమించడం జరిగింది. పుష్పలలిత నియామకానికి సైనోడ్ సెలక్షన్ బోర్డు ఆమోదం తెలిపిందని దక్షిణ భారత దేశ చర్చిల ప్రాంతీయ కార్యదర్శి మణి ఎం. ఫిలిప్ తెలిపారు. సెప్టెంబర్ 30న తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి బిషప్ జి. దేవకదాశం చేతులమీదుగా పుష్పలలిత బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు.

కర్నూలు జిల్లాలోని దిగువప్పాడు గ్రామంలో జన్మించిన పుష్పలలిత 1984లో క్రైస్తవ మత గురువుగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలోని పలు చర్చి సమాజాలకు పుష్పలలిత ఛైర్ పర్సన్‌గా పనిచేశారు. 2005 నుంచి రెండేళ్లపాటు నంద్యాల చర్చి ప్రాంతీయ పరిధిలో కోశాధికారిగా కూడా ఆమె విధులు నిర్వహించారు.
30ఏళ్ల నుంచి మతగురువుగా ఉన్న పుష్పలత సుమారు 400 గ్రామాల్లోని ప్రజలకు విద్యా, ఆరోగ్య విషయాలపై అవగాహన కలిగించారు. దేశంలో రెండో బిషప్‌గా పుష్పలలిత నియామకం కాగా మొదటగా 1996లో రెవరెండ్ అలివేలి కాదక్షమ్మను గుడ్ సమరిటన్ ఎవంజిలికల్ లూథరన్ చర్చి తన బిషప్ గా నియమించుకుంది.












Click it and Unblock the Notifications