వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫడ్నవీస్ హెలికాప్టర్ ప్రమాదానికి ప్రధాన నీటి కొరతే!

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హెలికాప్టర్ ప్రమాదానికి లాతూర్ నీటి సమస్య కూడా ఒక ప్రధాన కారణంగానే తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హెలికాప్టర్ ప్రమాదానికి లాతూర్ నీటి సమస్య కూడా ఒక ప్రధాన కారణంగానే తెలుస్తోంది. గురువారం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రయాణించిన సికోరస్కీ ఎస్76సీ హెలికాప్టర్ లూతూర్ జిల్లాలోని శివాజీ మహావిద్యాలయ స్కూల్ గ్రౌండ్ నుంచి టెకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కుప్పకూలిన విషయం తెలిసిందే.

మా రాజుకు ప్రమాదం తప్పింది: ఫడ్నవీస్ కోసం ప్రాణాలకు తెగించిన ఇర్ఫాన్మా రాజుకు ప్రమాదం తప్పింది: ఫడ్నవీస్ కోసం ప్రాణాలకు తెగించిన ఇర్ఫాన్

అయితే, ఈ ప్రమాదం జరిగిన వీడియోలో భారీగా దుమ్ము చెలరేగడంపై ఏవియేషన్ నిపుణులు, హెలికాప్టర్ పైలట్లు సునిశితంగా గమనించారు. హెలికాప్టర్ టెకాఫ్ అయ్యే సమయంలో అంత భారీగా దుమ్ము రేగడం కూడా ప్రమాదానికి కారణమై ఉంటుందని వారు పేర్కొంటున్నారు.

Did Latur water crisis bring down Devendra Fadnavis’ chopper?

'సాధారణంగా హెలికాప్టర్ల కోసం ఏర్పాటు చేసే హెలిప్యాడ్ల ప్రాంతంలో దుమ్ము లేవకుండా బాగా నీళ్లు చల్లడం జరుగుతుంది. అయితే, ఇక్కడ మాత్రం అలా జరగలేదని తెలుస్తోంది' అని ఓ హెలికాప్టర్ పైలట్ తెలిపాడు. కాగా, ఏప్రిల్ 2016లో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతంలో ప్రభుత్వ ఉపయోగించే హెలిప్యాడ్ల కోసం నీళ్లు భారీగా ఉపయోగించడంపై విమర్శలు వచ్చాయి.

ఈ క్రమంలో హెలిప్యాడ్ల కోసం ఉపయోగించే నీటిని తగ్గించేశారు అధికారులు. ప్రమాదం జరిగిన గురువారం కూడా హెలిప్యాడ్ వద్ద ఎక్కువ మొత్తంలో నీళ్లు ఉపయోగించలేదని, 45డిగ్రీల ఉష్ణోగ్రత ఉండటంతో అది ఏ మాత్రం సరిపోలేదని అధికారులు చెప్పారు. హెలిప్యాడ్ ప్రాంతంలోనే అనేక శిథిలాలు, ఇటుకలు, నిర్మాణ వ్యర్థాలు పడవేసి ఉన్నాయని తెలిపారు.

హెలికాప్టర్ భద్రంగా ల్యాండ్ అవ్వాలన్నా? టేకాఫ్ అవ్వాలన్నా? హెలిప్యాడ్ల కోసం తగినంతగా నీటిని ఉపయోగించాల్సిందే. లేదంటే పైలట్ హెలికాప్టర్‌ను టేకాఫ్ సమయంలో భారీగా దుమ్ములేసి అతనికి చుట్టుపక్కల ఏముందో కనిపించే అవకాశం లేకుండా పోతుంది. దీంతో భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. లాతూర్ ప్రమాదం కూడా ఇలాగే జరిగిందని తెలుస్తోంది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే హెలిప్యాడ్లను తగినంత నీటిని ఉపయోగించి సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది.

English summary
Among the factors that could have led to the chief minister's helicopter's crash figures an unprecedented one: Latur's severe water shortage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X