హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రంక్ అండ్ డ్రైవ్: ట్రాఫిక్ బాధ్యతలు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తాగి వాహనాలు నిడిపి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి న్యాయస్థానం ట్రాఫిక్ విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

కంట్రోల్ రూం సమీపంలో మంగళవారం నాడు పలువురు డ్యూటీని నిర్వహించారు. ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ వారి విధులను పర్యవేక్షిస్తున్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి గతంలోను ఇలా ట్రాఫిక్ విధులు అప్పగించిన సందర్భాలు ఉన్నాయి. మంగళవారం నాడు ముప్పై మందికి పైగా ట్రాఫిక్ విధులు నిర్వర్తించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్

డ్రంక్ అండ్ డ్రైవ్

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎక్కువై పోతుండ‌డం, త‌ద్వారా రోడ్డు ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో గత కొంత కాలంగా హైదరాబాద్ నగరంలో డ్రంకెన్ డ్రైవ్ త‌న‌ఖీలు తీవ్రతరం చేశారు.

డ్రంక్ అండ్ డ్రైవ్

డ్రంక్ అండ్ డ్రైవ్

ఇటీవ‌ల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 31 మంది ప‌ట్టుబడ్డారు. వీరిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు వారిని కోర్టులో హాజ‌రుప‌ర్చారు.

డ్రంక్ అండ్ డ్రైవ్

డ్రంక్ అండ్ డ్రైవ్

మద్యం సేవించి వాహనాలు న‌డుపుతూ ప‌ట్టుబ‌డ్డ వీరికి శిక్ష‌గా ట్రాఫిక్ విధుల్లో పాల్గొనాల‌ని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

డ్రంక్ అండ్ డ్రైవ్

డ్రంక్ అండ్ డ్రైవ్

దీంతో డ్రంకెన్ డ్రైవ్‌లో ప‌ట్టుబ‌డ్డ‌ 31 మంది కంట్రోల్ రూం సమీపంలో ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ ప్ల‌కార్డులు ప‌ట్టుకొని విధులు నిర్వ‌హించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్

డ్రంక్ అండ్ డ్రైవ్

ట్రాఫిక్ పోలీసుల సాయంతో వాహ‌నాల‌ను కంట్రోల్ చేశారు. ట్రాఫిక్ పోలీసుల్లా చేతి సిగ్న‌ల్స్ సూచిస్తూ విధులు నిర్వ‌హించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్

డ్రంక్ అండ్ డ్రైవ్

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ప‌ట్టుబ‌డిన వారి ప‌ట్ల క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు. మంగళవారం మాత్రం ట్రాఫిక్ బాధ్యతలు అప్పగించారు.

English summary
Drunk and Drive accused as Traffi Police in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X