మృత్యకారులు: ఎలా బతికామో దేవుడికే తెలియాలి
విశాఖపట్నం: వేటకు వెళ్తేకాని వారిటి పూట గడవదు. అలలతో సావాసం చేస్తారు. వేటకు వేళ్లే మగవారు ఇంటికి ఎప్పుడు తిరిగి వస్తారోనని ఇంటిలోని ఆడవారు ఎదురు చూడాల్సిందే. ఇది గంగపుత్రుల జీవనం. గతేడాది హుదూద్ తుఫాన్ మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ఇంకా మరువకు ముందే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వారిని వణికించింది.
తూర్పుగోదావరి జిల్లా, విశాఖకు చెందిన కొందరు మృత్యకారులు వేటకు వెళ్లి సముద్రం మధ్యలో చిక్కుకున్నారు. ఆరు రోజుల పాటు నరకం చూశారు. వీరు వేసుకెళ్లిన బోట్ల ఇంజిన్లు చెడిపోయాయి. సెల్ ఫోన్లు, వైర్‌లెస్ కూడా మూగపోయాయి.
బోటు ఎటు వెళ్తుందో తామెక్కడున్నామో కూడా తెలియని పరిస్ధితిలో ఉన్నారు. నడి సముద్రంలో క్షణమొక యుగంగా గడిపిన ఆ గంగపుత్రులు బతుకు జీవుడా అంటూ ఒడ్డుకు చేరుకున్నారు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన నాలుగు బోట్లు సోమవారం విశాఖ తీరానికి చేరుకున్నారు.

మృత్యకారులు: ఎలా బతికామో దేవుడికే తెలియాలి
వీరిలో తూర్పుగోదావరి జిల్లా సుబ్బంపేట, హుకుం పేట, పెరుమాళ్లపురానికి చెందిన 19 మంది విశాఖ ఫిషింగ్ హార్బర్ కు చేరుకోగా, విశాఖ జిల్లా ఎస్.రాయవరానికి చెందిన ఇద్దరు విజయనగరం జిల్లా చింతపల్లి రేవు వద్ద తీరానికి చేరుకున్నారు.

మృత్యకారులు: ఎలా బతికామో దేవుడికే తెలియాలి
నడి సముద్రంలో కెరటాల ఉధృతికి మా పోటు పెద్దనౌకను ఢీకొట్టింది. ఒక వైపు బోటు దెబ్బతిందని సుబ్బంపేటకు చెందిన గంటా సత్యనారాయణ తెలిపాడు. ఆరు లక్షలు విలువ చేసే వల సగానికిపైగా పాడైపోయిందని తెలిపాడు.

మృత్యకారులు: ఎలా బతికామో దేవుడికే తెలియాలి
వేటకు వెళ్లిన మాకు చావు తప్పదనుకున్నామని పెరుమాళ్లపురానికి చెందిన కుమారస్వామి తెలిపాడు. ఆ దేవుడే మా ప్రాణాలు కాపాడాడని, ఆ ఆరు రోజులు జీవశ్చవాల్లా బతికామని చెప్పాడు. తీరానికి 150 మైళ్ల దూరంలోకి పోయామని, గాలివాటం ఎటువీస్తుందో తెలియదని తెలిపాడు.

మృత్యకారులు: ఎలా బతికామో దేవుడికే తెలియాలి
గాలి, వర్షం ఒకేసారి వచ్చిందని హుకంపేటకు చెందిన గంటా దేవుడు తెలిపాడు. ఇంత పెద్ద కెరటాలు నేనెప్పుడూ చూడలేదని, ఇంజిన్ బోటు ఒక్కసారిగా పాడైపోయిందని అన్నాడు. బోటులోనే ఐదు రోజులు పస్తులు గడిపామని, చావు కళ్లలోనే కనిపించదని ఎంతో ఆవేదనతో చెప్పాడు.

మృత్యకారులు: ఎలా బతికామో దేవుడికే తెలియాలి
గత 18 ఏళ్లుగా వేటకు వెళుతున్నాని, ఎప్పుడూ ఇలాంటి పరిస్ధితి ఎదురుకాలేదని పెరుమాళ్లపురానికి చెందిన మేరుగు ఎల్లారావు తెలిపాడు. ఆరు రోజుల పాటు తుఫాన్‌లో చిక్కుకోయామని, ఇంటి ముఖం చూస్తామని అనుకోలేదని చెప్పాడు.












Click it and Unblock the Notifications