మిస్ వరల్డ్ ఫైనల్స్‌లో తెలుగమ్మాయి: మీ మద్దతూ తెలపండి

కెనడా/ఆదిలాబాద్: ఈ యేడాది జులైలో జరిగే మిస్ వరల్డ్ కెనడా అందాల పోటీల్లో తెలంగాణకు చెందిన అమ్మాయి కళ్యాణపు శ్రావ్య(21) పాల్గొంటోంది. మిస్ వరల్డ్ ఫైనలిస్టు విభాగంలో పోటీలో పాల్గొనే శ్రావ్యది ఖమ్మం జిల్లా అశ్వారావుపేట.

కెమికల్ ఇంజినీరింగ్ చేస్తూ..

కెమికల్ ఇంజినీరింగ్ చేస్తూ..

కాగా, శ్రావ్య తండ్రి కళ్యాణపు రవికుమార్ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో 2002 నుంచి 2005 వరకు ఏవోగా పనిచేశారు. అప్పుడు శ్రావ్య ఏడో తరగతి వరకు ఆదిలాబాద్‌లో చదువుకుంది. ఆమె ప్రస్తుతం యూనివర్సిటీ అఫ్ అల్‌బెట్రాలో కెమికల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతుతోంది.

మిస్ నార్తన్ ఆల్బర్టా వరల్డ్ టైటిల్ కైవసం

మిస్ నార్తన్ ఆల్బర్టా వరల్డ్ టైటిల్ కైవసం

మార్చి 12న మిస్ నార్థన్ అల్‌బర్‌టా వరల్డ్ టైటిల్‌ను శ్రావ్య సొంతం చేసుకుంది. కాగా, శ్రావ్యకు పదేళ్లున్నప్పుడే ఆమె ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి కెనడాకు వెళ్లింది. దీంతో అక్కడే చదువు కొనసాగింది.

కెనడా అదృష్టం

కెనడా అదృష్టం

కెనడాలో ఉన్న విద్యా, ఉద్యోగ అవకాశాలపై తాను ప్రపంచంలోని పిల్లలందరికీ వివరిస్తానని శ్రావ్య చెబుతోంది. కెనడాలో ఉండటం తమ అదృష్టమని, ఇక్కడ ఎన్నో అవకాశాలున్నాయని, విద్యార్థి దశ నుంచే మంచి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని తెలిపింది.

మద్దతు తెలపండి..

మద్దతు తెలపండి..

అంతేగాక, తాను ఏడాదిలో సుమారు వెయ్యి మంది విద్యార్థులకు తరగతి గదులకు వెళ్లి వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తానని శ్రావ్య వెల్లడించింది. తెలుగు రాష్ట్రానికి చెందిన అమ్మాయి కావడంతో ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో శ్రావ్యకు మద్దతు తెలుపాలని పలువురు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఆమెకు మద్దతు తెలిపారు. తెలుపుతున్నారు.

కాగా, శ్రావ్య కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆదిలాబాద్‌లోని ఆమె చిన్ననాటి మిత్రులు, స్కూలు యాజమాన్యంతో పాటు సొంత జిల్లా ఖమ్మం వాసులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆదిలాబాద్‌లో ఆమె పేరిట భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం గమనార్హం. శ్రావ్య తండ్రి రవికుమార్ జాతీయ మీడియాలో ఫోన్లో మాట్లాడుతూ.. ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో తన కూతురు విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+