ఒంటిమిట్ట: సీతారాముల కల్యాణ వైభవం(పిక్చర్స్)

కడప: ఒంటిమిట్టలో బుధవారం సీతారాముల కల్యాణం వైభవంగా సాగింది. భారీగా భక్తులు తరలిరావడంతో శ్రీ కోదండరామాలయ సమీపంలోని కల్యాణవేదిక బుధవారం రాత్రి జనసంద్రమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో వైభవంగా నిర్వహించిన కోదండరాముని కల్యాణం చూసేందుకు ఇతర జిల్లాలకు చెందిన భక్తులు తరలివచ్చారు.

టిటిడి ఆలయ అర్చకులు కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకు ముందు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సీతారామలక్ష్మణులను ఎదురెదురుగా ఉంచి పూలమాలలు మార్చుకునే ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. రాత్రి 8 గంటలకు మొదలైన కల్యాణం 10 గంటల వరకూ సాగింది. హస్తా నక్షత్రయుక్త శుభలగ్నంలో కల్యాణాన్ని నిర్వహించారు.

సీతారాముల కల్యాణ వైభవం

సీతారాముల కల్యాణ వైభవం

ఒంటిమిట్టలో బుధవారం సీతారాముల కల్యాణం వైభవంగా సాగింది. భారీగా భక్తులు తరలిరావడంతో శ్రీ కోదండరామాలయ సమీపంలోని కల్యాణవేదిక బుధవారం రాత్రి జనసంద్రమైంది.

గవర్నర్ నర్సింహన్, సీఎం చంద్రబాబు

గవర్నర్ నర్సింహన్, సీఎం చంద్రబాబు

తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో వైభవంగా నిర్వహించిన కోదండరాముని కల్యాణం చూసేందుకు ఇతర జిల్లాలకు చెందిన భక్తులు తరలివచ్చారు.

సీతారాముల కల్యాణ వైభవం

సీతారాముల కల్యాణ వైభవం

టిటిడి ఆలయ అర్చకులు కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

సీతారాముల కల్యాణ వైభవం

సీతారాముల కల్యాణ వైభవం

అంతకు ముందు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సీతారామలక్ష్మణులను ఎదురెదురుగా ఉంచి పూలమాలలు మార్చుకునే ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు.

సీతారాముల కల్యాణ వైభవం

సీతారాముల కల్యాణ వైభవం

రాత్రి 8 గంటలకు మొదలైన కల్యాణం 10 గంటల వరకూ సాగింది. హస్తా నక్షత్రయుక్త శుభలగ్నంలో కల్యాణాన్ని నిర్వహించారు.

సీతారాముల కల్యాణ వైభవం

సీతారాముల కల్యాణ వైభవం

భారీ పందిరి వేయడంతో ఇదంతా భక్తులతో నిండిపోయింది. గవర్నర్‌ ఈఎస్ఎల్ నర్సింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తదితరులు స్వామివారి ముందు కూర్చోగా, వీవీఐపీలు, వీఐపీలు వేర్వేరుగా కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు.

సీతారాముల కల్యాణ వైభవం

సీతారాముల కల్యాణ వైభవం

సాధారణ భక్తులు కూడా దగ్గరగా కల్యాణవేడుకను చూసేందుకు వీలుగా కల్యాణ వేదిక ప్రాంగణంలో 23 ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటుచేశారు.

సీతారాముల కల్యాణ వైభవం

సీతారాముల కల్యాణ వైభవం

శ్రీరాముడి పట్టాభిషేకం, సీతారాముల కల్యాణం, సీతారామలక్ష్మణ, భరత, శత్రుజ్ఞుల విద్యుత్తు దీపాల సెట్టింగులు ఆకట్టుకున్నాయి.

సీతారాముల కల్యాణ వైభవం

సీతారాముల కల్యాణ వైభవం

కల్యాణ వేదికను కూడా రంగురంగుల పుష్పాలు, ఫలాలతో అలంకరించడం విశేషం.

సీతారాముల కల్యాణ వైభవం

సీతారాముల కల్యాణ వైభవం

టిటిడికి చెందిన ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు నిర్వహించినపుడు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి ఆభరణాలు బహుమతి ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది.

సీతారాముల కల్యాణ వైభవం

సీతారాముల కల్యాణ వైభవం

సీతారాములకు రూ.28 లక్షల విలువైన ఆభరణాలను తితిదే అధికారులు గవర్నర్‌ నరసింహన్‌ చేతుల మీదుగా సీతారాములకు సమర్పింపజేశారు.

సీతారాముల కల్యాణ వైభవం

సీతారాముల కల్యాణ వైభవం

గవర్నర్‌తో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు.

సీతారాముల కల్యాణ వైభవం

సీతారాముల కల్యాణ వైభవం

ఈ వేడుకలో టిటిడి ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి, మంత్రులు గంటా శ్రీనివాసరావు, మాణిక్యాలరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, దేవినేని ఉమ, మండలి ఉపాధ్యక్షుడు సతీష్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

సీతారాముల కల్యాణ వైభవం

సీతారాముల కల్యాణ వైభవం

శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం కోదండరాముడు శివధనుర్బాణాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

సీతారాముల కల్యాణ వైభవం

సీతారాముల కల్యాణ వైభవం

కోలాటాలు, కేరళవాయిద్యాలు వెంటరాగా స్వామి పురవీధుల్లో వూరేగారు. మహిళలు కాయ, కర్పూరం సమర్పించారు.

సీతారాముల కల్యాణ వైభవం

సీతారాముల కల్యాణ వైభవం

కోదండరాముడి కల్యాణోత్సవానికి గోదావరి జిల్లాల్లోని 30 గ్రామాల భక్తులు శ్రీ కృష్ణ చైతన్యసంఘం ఆధ్వర్యంలో గోటితో ఒలిచిన తలంబ్రాలను తీసుకువచ్చారు. వీటిని ప్రభుత్వవిప్‌ మేడా, తితిదే జేఈవో భాస్కర్‌లకు వారు అందచేశారు.

సీతారాముల కల్యాణ వైభవం

సీతారాముల కల్యాణ వైభవం

భక్తులకు ఇబ్బందులు తల్తెకుండా ప్రత్యేక అన్నదాన కేంద్రాలను పలు స్వచ్ఛంధసంస్థలు ఏర్పాటుచేశాయి.

సీతారాముల కల్యాణ వైభవం

సీతారాముల కల్యాణ వైభవం

రాయలసీమ అయ్యప్పసేవాసమితి, నవ్యాంధ్ర అయ్యప్ప సేవాసమితి ప్రత్యేక అన్నదానకేంద్రాలను ఏర్పాటుచేశాయి. వీటిని ప్రభుత్వవిప్‌ మల్లికార్జునరెడ్డి ప్రారంభించారు.

సీతారాముల కల్యాణ వైభవం

సీతారాముల కల్యాణ వైభవం

అలాగే టిటిడి ఆహారపొట్లాలను పంపిణీచేసింది. కడపకు చెందిన శ్రీ కల్కి మానవ సేవాసమితి 8వేల లీటర్ల చల్లని మజ్జిగను భక్తులకు అందజేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+